బుల్లెట్ రైలు ప్రాజెక్టులో మరో అడుగు....
దిల్లీ: అహ్మదాబాద్ - ముంబయి బుల్లెట్ రైలు ప్రాజెక్టులో మరో ముఖ్యమైన దశను పూర్తి చేశారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 300 కిలోమీటర్ల వంతెన మార్గాన్ని పూర్తి చేసినట్టు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన 'ఎక్స్' మాధ్యమంలో ఒక వీడియోను షేర్ చేశారు. దేశంలోనే తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టుగా ఇది వేగంగా పురోగమిస్తోంది. మొత్తం కారిడార్ పొడవు 508.17 కిలోమీటర్లు. రైలు ప్రారంభమైన తరువాత అహ్మదాబాద్ నుండి ముంబయి వరకు కేవలం 2.58 గంటల్లో ప్రయాణించవచ్చు. గుజరాత్‌లో 8 స్టేషన్లు, మహారాష్ట్రలో 4 స్టేషన్లు ఉండనున్నాయి. అధికారులు తెలిపిన ప్రకారం, తొలి ట్రయల్ రన్ 2026లో నిర్వహిస్తారు. ఈ బుల్లెట్ రైలు గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు, ఇది విమానం టేకాఫ్ వేగంతో సమానమని పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులోకి వచ్చిన తర్వాత గరిష్ఠంగా 320 కిలోమీటర్ల వేగంతో నడపనున్నారు. రూ.1.08 లక్షల కోట్ల వ్యయంతో రూపొందిన ఈ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి అమలు చేస్తున్నాయి.
Comment List