‘హరిహర వీరమల్లు’ బడ్జెట్ ఎన్ని కోట్లో తెలుసా...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు అత్యంత ఉత్కంఠగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో "హరిహరి వీరమల్లు" ఒకటి. ఇది పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. చిత్రానికి ఎ.ఎమ్. జ్యోతికృష్ణ మరియు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతాన్ని అందించగా, ఎ.ఎమ్. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎ.దయాకర్ రావు ఈ భారీ బడ్జెట్ సినిమాను నిర్మిస్తున్నారు.ముందుగా జూన్ 12న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించినప్పటికీ, వీఎఫ్ఎక్స్ పనులు పూర్తి కాలేదని, అందువల్ల సినిమా విడుదల వాయిదా వేయబడిందని శుక్రవారం అధికారికంగా వెల్లడించారు.ఇదిలా ఉండగా, తాజా ప్రమోషనల్ ఈవెంట్‌లో, మచిలీపట్నంలో పాల్గొన్న దర్శకుడు ఎ.ఎమ్. జ్యోతికృష్ణ ఈ సినిమా బడ్జెట్ గురించి ఆసక్తికర విషయాన్ని తెలిపారు. ఆయన ప్రకారం, "హరిహరి వీరమల్లు" సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుండటంతో, మొత్తం బడ్జెట్ రూ.250 కోట్లకు పైగానే ఉంటుందని తెలిపారు. జ్యోతికృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Comment List