పెళ్లి సంబంధాలు ఎందుకు విఫలమవుతున్నాయి?
జీవితం జోడికి సరైన తోడు ఎప్పుడు?
సంబంధాలు కుదరడానికి సహజమైన పరిష్కారాలు
లోకల్ గైడ్
నేడు సమాజంలో వరుడికి, వధువుకు సంబంధాలు కుదరడం చాలావరకు కష్టతరంగా మారిపోయింది. ఆధునిక జీవనశైలి, వ్యక్తిగత అభిరుచులు, భిన్నమైన ఆర్థిక స్థితిగతులు,మరియు కుటుంబాల ఆశలు ఇవన్నీ కలిసివచ్చి పెళ్లి సంబంధాలపై ప్రభావం చూపుతున్నాయి.
వధువు,వరుడు ఎదుర్కొంటున్న సమస్యలు
నేటి సమాజంలో యువతీ, యువకులు తమ భవిష్యత్తు కోసం ఆలోచిస్తూ జీవితంలో స్థిరపడాలనే సంకల్పంతో పెళ్లి ధ్యాస లేకుండా సంవత్సరాలు గడుపుతున్నారు. కాలక్రమేనా 30 సంవత్సరాల వయసు దాటిన కూడా ఉద్యోగం రాకపోవడం జీవితంలో స్థిరపడకపోవడం వల్లనే పెళ్లి చేసుకోవడం ఆలస్యం అయిపోతుంది.ఆధునిక కాలంలో యువత విద్య, కెరీర్ పై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల పెళ్లి చేసుకునే వయసు పెరుగుతోంది.ఈ కారణంగా సంబంధం
చూడటం ఆలస్యం అవుతోంది.ఆర్థిక,భౌతిక పరిస్థితులు ప్రస్తుత సమాజంలో పెళ్లి సంబంధాలపై ఆర్థిక స్థితి పెద్ద పాత్ర పోషిస్తోంది. కాబోయే వరుడు లేదా వధువు ఆర్థికంగా స్థిరంగా ఉండాలని కోరే ఆశలు పెరిగాయి.దీని మూలంగానే పెండ్లిలు చేసుకోవడం ఆలస్యం అవుతుంది.
వధూవరులు వ్యక్తిగత అభిరుచులునేటి తరానికి వారి సొంత అభిప్రాయాలు, జీవిత భాగస్వామి గుణగణాలపై ప్రత్యేకమైన అభిరుచులు ఉన్నాయి.ఈ అవసరాలు అనేకసార్లు సంబంధాలు కుదరడంలో అడ్డంకులవుతాయి. ఇలాంటి సమస్యల వల్ల పెళ్లిళ్లు తొందరగా కుదరడం లేదు.పురాతన ఆచారాల ప్రభావం ఇంకా కొన్ని కుటుంబాలు కులం,మతం, ప్రాంతం వంటి పరిమితులను పాటించడం వల్ల సంబంధాలు కుదరడం కష్టంగా మారుతుంది.ఆన్లైన్ సంబంధాల ఒడిదుడుకులు
డిజిటల్ ప్రపంచంలో మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లు,యాప్స్ వినియోగం పెరిగినా,వాటి ద్వారా సరైన సంబంధం కనుగొనడం చాలా సార్లు సమస్యగా మారుతోంది. ఆన్లైన్ సంబంధాల్లో పూర్తి వివరాలు తెలియకపోవడం వల్ల కూడా కొంతమంది పెళ్లిళ్లను వాయిదా వేస్తున్నారు.ఇకనైనా వధూవరులు పెళ్లిళ్ల విషయంలో ముందు జాగ్రత్తగా ఆలోచించేసుకొని తమకు సంబంధించిన వ్యక్తుల ద్వారా పెళ్లి సంబంధాలను కుదుర్చుకుంటే మంచిది.
పెళ్లి సంబంధాలను కుదుర్చుకునే విషయంలో వచ్చే ఇబ్బందులను వధూవరులు పరిష్కరించుకునే విధానాలు
వధూవరులు తమ వ్యక్తిగత అభిప్రాయాల్లో మార్పులు చేసుకోవాలి
కుటుంబాలు మరియు వ్యక్తులు పెళ్లి సంబంధాల విషయంలో కులం,మతం వంటి పరిమితులను తగ్గించి,వ్యక్తిగత గుణగణాలపై దృష్టి పెట్టడం వారి కుటుంబ విషయాలను తెలుసుకొని పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవాలి. బంధుమిత్రుల సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలి
మ్యాట్రిమోనియల్ యాప్స్ మరియు వెబ్సైట్లను ఉపయోగించి నిష్పాక్షికంగా సంబంధాలు పరిశీలించడం ద్వారా మంచి అవకాశాలు పొందవచ్చు.కుటుంబాల మధ్య సంభాషణ
సంబంధాలు కుదిరేందుకు కుటుంబాల మధ్య స్పష్టమైన చర్చలు, పరస్పర అర్థం చేసుకోవడం అవసరం.కుటుంబాల ఆశలు సమన్వయం చేయడం వరుడు,వధువు అభిప్రాయాలు,కుటుంబాల ఆశలు సమతుల్యం చేస్తే సంబంధాలు కుదరడంలో సులభతరం అవుతుంది.
స్వేచ్ఛను ప్రోత్సహించడం
పెళ్లి సంబంధం కేవలం కుటుంబాల నిర్ణయం కాకుండా,వరుడు,వధువు స్వేచ్ఛను గౌరవించడం ముఖ్యం. ముఖ్యంగా పెళ్లి చేసుకునే వధూవరులు ఒకరినొకరు అర్థం చేసుకొని కలిసికట్టుగా ముందడుగు వేయాలి.అప్పుడే పెళ్లిళ్లు జరుగుతాయి. ఇకనైనా తల్లిదండ్రులు తమ పిల్లల గురించి తొందర పడాలి తమకు అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి సంబంధాలను ఎప్పటికప్పుడు తెలుసుకొని తమ బిడ్డలకు పెళ్లిళ్లు చేయాలి.ఏ మాత్రం ఆలస్యం చేయకూడదు.
ప్రస్తుత కాలంలో పెళ్లి సంబంధాలు కుదరడం కష్టతరమైనప్పటికీ, సమస్యల్ని అర్థం చేసుకుని సరైన పరిష్కారాలను అవలంబిస్తే మంచి ఫలితాలు రావచ్చు. అర్థవంతమైన సంభాషణ, సున్నితమైన ఆలోచనలు, మరియు సంబంధాలపై దృఢమైన నమ్మకం పెళ్లి కుదుర్చడంలో కీలకంగా ఉంటాయి.వధూవరులు ప్రభుత్వ రంగంలో లేదా ప్రైవేట్ రంగంలో స్థిరపడిన వెంటనే పెళ్లిళ్లు చేస్తే ఎలాంటి సమస్య ఉండదు. వధూవరులు పెద్దగా చదువుకోకున్నా వ్యవసాయంపై ఆధారపడి పనిచేస్తున్న కూడా వారికి తల్లిదండ్రులు వెంటనే సంబంధాలను చూసి పెళ్లిళ్లు చేస్తే ఎలాంటి ఇబ్బందులు రావు. తల్లిదండ్రులే ముందు జాగ్రత్తగా తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వారు ఏ రంగంలో స్థిరపడిన కూడా వెంటనే పెళ్లి సంబంధాలు చూసి ఆలస్యం చేయకుండా పెళ్లి చేస్తే ఎలాంటి సమస్యలు రావు.పెళ్లిళ్ల సమస్యలను తల్లిదండ్రులు,పెద్దలు అందరూ కలిసి వధూవరులతో చర్చించి సమస్యలను వెంటనే పరిష్కరించుకోవాలి.
Comment List