వంగూరి వాచకం -నవరత్నాలు
1.నచ్చితే నిందిస్తున్నా
దీవెనలాగా వినిపిస్తుంది
మెచ్చితే మెల్ల కన్నున్నా
మేనక లాగా కనిపిస్తుంది
2.పెళ్లంటే ముడులు మూడు
అడుగులు అయితే ఏడు
ఫోటోలు వీడియోలు మాత్రం
అటూఇటూ తిప్పి కొట్టుడు బోలెడు
3.సెంటిమెంట్ అంటూ
కుంటి సాకులతో నలుగుతావేలా
అష్టమి నాడు పుట్టిన
కృష్ణుడు జగద్గురువై వెలగడం లేదా
4.నేటి స్వరాజ్య భోగం
నాటి స(అ)మరవీరుల త్యాగఫలం ఆశయాలు ఆచరిస్తే పురోగమనమైతే ఆదమరచి విస్మరిస్తే అధోగతే
5.ఎన్ని ప్రలోభాలు వచ్చినా
స్థిర చిత్తాన్ని మార్చగలవా
ఎంత గాలి వీచినా
కొండను కదల్చగలదా
6.పోషించే పాత్రలే ఇష్టాయిష్టాల
మహత్తర మనో నిర్ణేతలు
కోడలిగా ఉంటే అత్త నచ్చకపోగా
అత్తగా ఉంటే కోడలు మెచ్చదు
7.సందమామ సముద్రంలో
తానమాడ ఎళ్తున్నాడు నేడు ఆకాశమార్గాన అంటిన మకిలీని అరగదీయాలని ఆశనేమో సూడు
8.కళ్లకు మనసుంటే
ఇలలో కళ కానిదేది
మూలనున్న సాలెగూడు
భలే కళా నైపుణ్యమేటి
9.తనువును నిలిపే
బంధనం అణుబంధం
మనసును నడిపే
ఇంధనం అనుబంధం
వంగూరి గంగిరెడ్డి
9652286270
షాద్ నగర్
Comment List