బషీరాబాద్ లో పోషన్ పఖ్వాడ అవగాహన కార్యక్రమం
కార్యక్రమంలో పాల్గొన్న వివిధ గ్రామాల అంగన్వాడీ టీచర్లు
బషీరాబాద్ (లోకల్ గైడ్)
బషీరాబాద్ అంగన్వాడీ కేంద్రంలో పోషన్ పఖ్వాడ కార్యక్రమం నిర్వహించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆదేశాల మేరకు ఈనెల 8 నుంచి 22 వరకు పోషన్ పక్వాడ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా గురువారము బషీరాబాద్ గ్రామపంచాయతీ అంగన్వాడి కేంద్రంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ జ్యోతి ఆధ్వర్యంలో పోషన్ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పిల్లల బరువులు నమోదు చేసి, బరువు తక్కువగా ఉన్న పిల్లల తల్లులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అంతేకాక అంగన్వాడి కేంద్రంలో పిల్లలకు ఆకలి పరీక్షలు నిర్వహించారు. ఆకలి పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసిన పిల్లలకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని వారి తల్లిదండ్రులకి సూచించారు. ఈ పరీక్షలో అసంపూర్తిగా పాల్గొన్న పిల్లలకి పోషకాహార పునరావాస కేంద్రానికి పంపించాలని తల్లిదండ్రులకు దిశా నిర్దేశం చేశారు. దీంతోపాటు ఐదు సంవత్సరాల వరకు పిల్లల పెరుగుదల పర్యవేక్షణ అత్యంత కీలకమని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు,గ్రామ మహిళలు తదితరులు పాల్గొన్నారు
Comment List