‘రాధే శ్యామ్’ ద‌ర్శ‌కుడి దర్శకత్వంలో వ‌రుణ్ తేజ్ కొత్త చిత్రం

‘రాధే శ్యామ్’ ద‌ర్శ‌కుడి దర్శకత్వంలో వ‌రుణ్ తేజ్ కొత్త చిత్రం

లోకల్ గైడ్:  VarunTej | టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్ ప్ర‌స్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన మెర్లపాక గాంధీ దర్శకత్వంలో ఒక హర్రర్-కామెడీ చిత్రంలో నటిస్తున్న విష‌యం తెలిసిందే.VarunTej | టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్ ప్ర‌స్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన మెర్లపాక గాంధీ దర్శకత్వంలో ఒక హర్రర్-కామెడీ చిత్రంలో నటిస్తున్న విష‌యం తెలిసిందే. ‘కొరియన్ కనకరాజు’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తోంది. యువి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా ఈ ఇండో-కొరియన్ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాయి.ఇదిలావుంటే.. తాజా సమాచారం ప్రకారం వరుణ్ తేజ్ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశ‌లు ఉన్న‌ట్లు తెలుస్తుంది. టాలీవుడ్ దర్శకుడు రాధాకృష్ణతో కలిసి పనిచేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. రాధాకృష్ణ గతంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘రాధే శ్యామ్’ చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది.‘రాధే శ్యామ్’ విడుదల తర్వాత రాధాకృష్ణ తన తదుపరి చిత్రం గురించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ఇప్పుడు వరుణ్ తేజ్‌కు ఆయన ఒక అందమైన ప్రేమకథను వినిపించారని సినీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ఈ కథ వరుణ్ తేజ్‌ను ఎంతగానో ఆకట్టుకుందని సమాచారం. ప్రస్తుతానికి ఇది కేవలం ఊహాగానం మాత్రమే. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో అధికారికంగా తెలియాల్సి ఉంది. ఒకవేళ ఈ వార్త నిజమైతే, వరుణ్ తేజ్ మరియు రాధాకృష్ణ కాంబినేషన్‌లో ఎలాంటి చిత్రం వస్తుందో చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

యువ‌తి చేసిన ప‌నికి లావ‌ణ్య త్రిపాఠికి కోప‌మొచ్చింది. యువ‌తి చేసిన ప‌నికి లావ‌ణ్య త్రిపాఠికి కోప‌మొచ్చింది.
లోకల్ గైడ్: Lavanya Tripathi | యువ‌తి చేసిన ప‌నికి లావ‌ణ్య త్రిపాఠికి కోప‌మొచ్చింది.. మెగా కోడలు గ‌ట్టిగానే ఇచ్చి ప‌డేసిందిగా..! Lavanya Tripathi | పహల్గాంలో...
సింహాచలం ప్రమాదం గురించి తెలిసి ఎంతో దిగ్భ్రాంతిగా అనిపించింది: పవన్ కళ్యాణ్
యాప్‌లో ప్రకటన ఇచ్చి… ఆన్‌లైన్‌లో మోసానికి బలయ్యాడు!
అద్భుతమైన క్యాచ్ పట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫీల్డర్‌
‘రాధే శ్యామ్’ ద‌ర్శ‌కుడి దర్శకత్వంలో వ‌రుణ్ తేజ్ కొత్త చిత్రం
అంబేద్కర్ ఆశాల సాధనలో
గడపగడపకు జై బాబు, జై భీమ్, జై సంవిదాన్ నినాదం