అంబేద్కర్ ఆశాల సాధనలో

 మే 7న  అంబేద్కర్ 12 అడుగుల కాంస్య విగ్రహావిష్కరణ 

అంబేద్కర్ ఆశాల సాధనలో

 నవపేట్ మండలంలో గోడపత్రికలను విడుదల చేసిన దళిత సంఘాల నాయకులు 

లోకల్ గైడ్  :

డాక్టర్ బి.ఆర్  అంబేద్కర్ కాంస్య విగ్రహ ఆవిష్కరణ  గోడల పోస్టర్ ను మంగళవారం నాడు నవపేట్ మండల కార్యాలయంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో పోస్టర్ ను విడుదల చేశారు .వికారాబాద్ జిల్లా వికారాబాద్ మున్సిపల్ కేంద్రంలోని  ఎన్నెపల్లి చౌరస్తాలో 12 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని మే 7న  ఘనంగా ఆవిష్కరించనున్నారు. అంతటి గొప్ప కార్యక్రమానికి సహకరించిన  తెలంగాణ శాసనసభాపతి  గడ్డం ప్రసాద్ కుమార్ కు  దళిత సంఘాల నాయకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.అందరూ ఆహ్వానితులే.. దళిత సంఘాల నాయకులు  అణగారిన వర్గాలకు  బిఆర్ అంబేద్కర్ నిలువెత్తు రూపం అని  దళిత సంఘాల నాయకులు పేర్కొన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం సమ సమాజాన్ని నిర్మించిందని, అంబేద్కర్ వారసులుగా  అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తున్నారు. వికారాబాద్ జిల్లాలో మరి ఎక్కడలేని   విధంగా అంబేద్కర్ కాంస్య  విగ్రహాన్ని రూపొందించారు. భావితరాలకు  అంబేద్కర్ ఆశలను అందించే విధంగా  నిర్మాణం చేశారు. బడుగు బలహీన వర్గాలను ఇతర వర్గాల స్థాయికి తీసుకెళ్లిన ఘనత బి ఆర్ అంబేద్కర్ కె  దక్కుతుందని దళిత సంఘాల నాయకులు అన్నారు. 12 అడుగుల కాంస్య  విగ్రహాన్ని  మే 7న  వికారాబాద్ లో ఘనంగా ఆవిష్కరించనున్న శుభ సందర్భంలో ఆయన విగ్రహావిష్కరణకు  అందరూ ఆహ్వానితులేనని  దళిత సంఘాల నాయకులు పేర్కొన్నారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణ పోస్టర్ విడుదల కార్యక్రమంలో వివిధ దళిత సంఘాల నాయకులు  ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News