గురువును ఘనంగా సన్మానించిన పూర్వ విద్యార్థులు.
(లోకల్ గైడ్ జడ్చర్ల)
కవి,రచయిత వి.జానకి రాములు గౌడ్ ను ఘనంగా సన్మానించడం ఎంతో ఆనందంగా ఉందని 2000 లో పదవ తరగతి చదివిన విద్యార్థులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రైవేటు విద్యాసంస్థలో అధ్యాపకుడిగా పనిచేస్తూ ఎలాంటి లాభాపేక్ష లేకుండా నిస్వార్థంగా తన వంతుగా సమాజం,విద్యార్థుల కోసం నిరంతరం తపన పడుతూ యువతకు ఉపయోగపడే రచనలు చేస్తూ అందరికీ స్ఫూర్తి దాతగా నిలిచారు. వారు రచించిన జానకిరామ్,సిరా చుక్క కవితా సంపుటిలు నేటి యువత, విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి.నేడు సమాజంలో జరుగుతున్న మంచి చెడులను గురించి కవితలుగావ్యాసాలుగా రాస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.భవిష్యత్తులో మరిన్ని అద్భుతమైన పుస్తకాలు రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మ గురువును ఈరోజు సన్మానించుకోవడం ఎంతో గర్వంగా ఉందని పూర్వ విద్యార్థులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు శ్రీధర్ రెడ్డి,కిరణ్, వేణుగోపాల్ రాఘవేందర్, రాఘవేందర్ గౌడ్,శ్రీను,రవి మొదలగు వారు పాల్గొన్నారు.
Comment List