కొత్త సినిమాతో రీ-ఎంట్రీకి సిద్ధం..!
‘అత్తరు సాయిబు’గా మంచు మనోజ్ –
సినిమాల కంటే వ్యక్తిగత వివాదాలతో ఇటీవల వార్తల్లో నిలుస్తున్న మంచు మనోజ్, మళ్లీ వెండితెరపై తన ప్రత్యేకతను చూపించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం ‘భైరవం’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో మంచు మనోజ్‌తో పాటు బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ కూడా నటించారు. ఇది మినీ మల్టీస్టారర్‌గా తెరకెక్కుతోంది. మొదటగా ‘కన్నప్ప’కి పోటీగా ‘భైరవం’ని రిలీజ్ చేయాలని భావించినా, ఆ సినిమాని వాయిదా వేసిన నేపథ్యంలో 'భైరవం' విడుదల కూడా వాయిదా పడింది.ఇదిలా ఉంటే, ఇప్పుడు మంచు మనోజ్ మరో కొత్త ప్రాజెక్ట్‌తో ముందుకు వచ్చారు. ‘90 ఎంఎల్’ ఫేం శేఖర్ రెడ్డి దర్శకత్వంలో ‘అత్తరు సాయిబు’ అనే టైటిల్‌తో ఓ ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్‌లో నటించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమా పూజా కార్యక్రమాలు మే 20న, మనోజ్ పుట్టినరోజు సందర్భంగా జరిపే అవకాశముంది. లేకపోతే అదే రోజు టైటిల్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.ఇంతకు ముందు ఆయన ‘వాట్ ది ఫిష్’, ‘అహం బ్రహ్మస్మి’ అనే సినిమాలను మొదలుపెట్టినప్పటికీ, అవి ఎక్కడ వున్నాయో స్పష్టత లేదు. అలాగే, త్వరలో ‘మిరాయ్’ సినిమాలో విలన్‌గా కూడా కనిపించనున్నారు. ఇక గతంలో సోషల్ మీడియాలో మంచు కుటుంబ కలహాలు పెద్ద చర్చకు దారితీశాయి. అవి ఇప్పటికి పరిష్కారమయ్యాయో లేదో స్పష్టత లేదు. అయితే సినిమాల పరంగా మనోజ్ మళ్లీ తన స్థానం తిరిగి సంపాదించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాడు.
Comment List