అప్పుడు బన్నీతో, ఇప్పుడు చరణ్‌తో..
లోకల్ గైడ్:
ఈ మధ్య స్టార్ హీరోయిన్లు కూడా స్పెషల్ సాంగ్స్‌కి ఓకే చెప్పేందుకు వెనకాడటం లేదు. క్రేజ్ పెరగడం, భారీ రెమ్యునరేషన్ రావడం వంటివి కారణంగా స్టార్ హీరోల సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌లో కనిపించేందుకు వారు ఆసక్తి చూపుతున్నారు.ఐటెం సాంగ్స్ ఇప్పుడు "స్పెషల్ సాంగ్స్"గా మారిపోయినా, వాటికి ఉన్న క్రేజ్ మాత్రం ఏనాడో మొదలైంది. ఒకప్పుడు ప్రత్యేకమైన మోడల్స్‌ని, విదేశాల నుంచి తెల్లచర్మ సుందరుల్ని తీసుకొచ్చి ఐటెం సాంగ్స్ చేసేవారు. కానీ ఇప్పుడు హీరోయిన్లే ఐటెం గర్ల్స్‌గా మారిపోయారు. దర్శకులు ఇప్పుడు స్టార్ హీరోయిన్‌లను కూడా స్పెషల్ సాంగ్స్ కోసం ఎంపిక చేస్తున్నారు. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో ఈ ట్రెండ్ మళ్లీ బలంగా రీఎంట్రీ ఇచ్చింది.ఇటీవలి కాలంలో పుష్ప 1లోని "ఊ అంటావా మామా" పాట సెన్సేషన్ అయ్యింది. సమంత ఆ పాటలో తన గ్లామర్‌తో కనువిందు చేసింది. ఆ తర్వాత పుష్ప 2 కోసం శ్రీలీలను ఎంపిక చేశారు. అయితే సమంత చూపిన గ్రేస్, హాట్‌నెస్‌కి శ్రీలీల సరిపోలలేదన్న విమర్శలు వచ్చాయి.
ఇప్పుడు శ్రీలీల మరో స్టార్ హీరో సినిమా స్పెషల్ సాంగ్‌కి అవకాశం అందుకుందని టాక్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ "పెద్ది"లో మాస్ స్పెషల్ సాంగ్‌లో రామ్ చరణ్ సరసన శ్రీలీల స్టెప్పులేసనుందట. ఇండస్ట్రీ బజ్ ప్రకారం ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేస్తున్న ఓ ఎనర్జిటిక్ మాస్ బీట్‌కు ఆమె స్టెప్పులతో థియేటర్లను ఊపేయనుందట. రామ్ చరణ్ స్టైల్, శ్రీలీల డాన్స్ గ్రేస్ కలిస్తే మాస్ ఎక్స్‌ప్లోషన్ ఖాయమంటూ ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఈ వార్తలో ఎంత నిజముందో చూద్దాం.
Comment List