కోట మశమ్మ పండుగకు గుంజి బజారు హమాలీలకు ఆర్థిక సహకారం చేసిన
------లోకకళ్యాణం కోసం గ్రామ దేవతలు వెలిశారు.
------గ్రామ దేవతల పండుగలు సంస్కృతి,సాంప్రదాయాలను ప్రతి బింబిస్తాయి.
--------మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి
వనపర్తి లోకల్ గైడ్
పట్టణములో కోట మశమ్మ దేవత పండుగ ప్రతి సంవత్సరం హమాలీలు నిర్వహించుకోవడం అనవాయితీ.ఈ సందర్భంగా హమాలీ సోదరులు రావుల చంద్రశేఖర్ రెడ్డి సహకారం కోరగా స్పందించిన రావుల చంద్రశేఖర్ రెడ్డి కోట మశమ్మ పండుగకు నిర్వహించుకోవడానికి 15000రూపాయలు జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ ద్వారా అందించారు.
ఈ సందర్భంగా రావుల చంద్రశేఖర్ రెడ్డి ఫోన్ ద్వారా హమాలీ సోదరులతో మాట్లాడుతూ మొదటి నుండి కార్మికులకు అన్ని విధాలుగా అండగా ఉన్నామని రాబోవు రోజుల్లో కూడా తన సహకారం ఉంటుందని తెలిపారు. ఐకమత్యంతో పండుగ ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో బజారు హమాలీ సంఘం అధ్యక్షుడు ఆడమ్ చంద్రయ్య,ప్రధాన కార్యదర్శి ఎం.విష్ణు,శివ, లక్ష్మయ్య,రాజు,రాములు,
రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.
Comment List