ఆపరేషన్ సిందూర్‌తో పాక్ గగనతలంపై ప్రభావం
గత నెలలో పెహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతిగా, భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్తాన్ మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై మెరుపుదాడులు చేపట్టింది. భారత సైన్యం ముర్కిదేలోని లష్కరే తోయిబా ప్రధాన స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని, అర్ధరాత్రి 1.44 గంటలకు మిస్సైళ్లతో దాడి జరిపింది. లాహోర్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముర్కిదేలో 200 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఉగ్ర స్థావరం ఉంది. లష్కరే తోయిబా అనుబంధ సంస్థ జమ్మత్ ఉద్ దఆవా కూడా ఇక్కడినుంచే కార్యకలాపాలు సాగిస్తోంది. పెహల్‌గామ్ దాడి వెనుక లష్కరే తోయిబా చీఫ్ హాఫీజ్ సయీద్ ఉన్నట్టు భారత అనుమానం.ఇక బవహల్పూర్‌లోని జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఉస్మాన్ ఓ అలి క్యాంప్ కూడా ఈసారి లక్ష్యంగా మారింది. ఇది సుమారు 18 ఎకరాల్లో విస్తరించి ఉంది. 2019లోనే ఈ స్థావరాన్ని భారత్ లక్ష్యంగా పెట్టుకున్నా, ఆ సమయంలో దాడి చేపట్టలేదు. కానీ ఈసారి దాన్ని పూర్తి స్థాయిలో ధ్వంసం చేసింది. ముర్కిదే, బవహల్పూర్ క్యాంపుల్లో దాదాపు 25 నుంచి 30 మంది ఉగ్రవాదులు హతమయ్యారని సమాచారం. ఈ మెరుపుదాడుల అనంతరం పాక్ గగనతలం ఖాళీగా మారింది. పలు అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్ పాక్ గగనతలాన్ని వదిలి ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణిస్తున్నారు. అదే సమయంలో భారత్ గగనతలం అత్యంత రద్దీగా మారడం గమనార్హం. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్ ఈ మార్పులపై ఒక పిక్టోరియల్ ఫొటోను విడుదల చేసింది.
Comment List