మళ్లీ దాడి చేసిన పాక్..
లోకల్ గైడ్ : భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. శుక్రవారం సాయంత్రం చీకటి పడడంతో పాక్ మళ్లీ కాల్పులకు తెగబడుతూ.. డ్రోనులతో దాడులు చేస్తోంది. యూరీ, కుప్వారా, పూంఛ్, నౌగామ్ సెక్టార్లలో.. పాక్ సైన్యం కాల్పులు జరుపుతోంది. పాక్ ఎంత వేగంగా కాల్పులు జరుపుతుందో.. భారత్ అంతే వేగంతో వాటిని సమర్థవంతంగా తిప్పికోడుతోంది.ఇక జైసల్మేర్, యూరీలో బ్లాక్ అవుట్ అయింది. అనంతరం సైరన్లు మోగాయి. అలాగే హర్యానాలోని పంచకులతోపాటు పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో బ్లాక్ అవుట్ అయింది. జమ్మూ,అఖ్నూర్‌లో సైరన్లు మోగాయి. దీంతో ఆ ప్రాంతాన్నిబ్లాక్ అవుట్ చేశారు. మరోవైపు జమ్మూ కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ సరిహద్దుల్లో హై అలర్ట్‌ను సైనిక దళాలు ప్రకటించాయి.మరోవైపు ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లోని ఎయిర్‌పోర్టులను మూసివేసింది. మే 10 నుంచి 15వ తేదీ వరకు 28 ప్రధాన ఎయిర్‌పోర్టులు మూసివేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. అలాగే గుజరాత్ సరిహద్దుల్లో సైతం హైఅలర్ట్ ప్రకటించారు. జమ్మూకశ్మీర్‌లో డ్రోన్ దాడులు చేసేందుకు పాక్ చేస్తున్న ప్రయత్నాలను భారత్ విఫలం చేసింది. సాంబా,పఠాన్‌కోట్‌లోని సెక్టార్లలో పాక్ డ్రోన్లను సైన్యం కూల్చివేసింది.
Comment List