వంగూరి వాచకం -నవరత్నాలు

వంగూరి వాచకం -నవరత్నాలు

(మాతృ దినోత్సవం సందర్భంగా)

1.కమ్మదనం పెంచే 
అమూల్యమైన అద్భుత దినుసు 
ఉమ్మనీటిలో పెంచిన 
అపురూపమైన అమ్మ మనసు 

2.నోరు తెరిస్తే ' అ '
నోరు మూస్తే ' మ్మ '
పిల్లల నోరు నింపడానికి 
తన నోరు కట్టుకునేదే 'అమ్మ'.

3.అమ్మే వారికి 
వచ్చేది సొమ్ము 
'అమ్మే' ఎవరికైనా 
ఇచ్చేది దమ్ము


4.నొప్పి అయితే 
నోటికి వచ్చే మాట ‘అమ్మా’
నొప్పి భరించే 
కిటుకు తెలిసేది ఆమెకేగా

5.చిన్నప్పుడు 
అన్నిటికీ వత్తాసు అమ్మ
పెద్దయ్యాక 
వద్దన్నా వదలదు అంతరాత్మ 

6.జన్మ ఎంత గొప్పదైనా 
అమ్మేగా కారణం 
చెట్టు ఎంత పెద్దదైనా 
వేర్లే కదా ప్రాణం

7.చేసిన పనికి
కాసులతోనే సరియని నమ్మకు
చేసిన సేవకు
ప్రతిఫలం ఇయ్యగలవా అమ్మకు

8.పువ్వు పూయడానికి 
మొక్క ఎంత శ్రమించిందో?
నువ్వు రావడానికి 
అమ్మ ఎంత భరించిందో?

9.కోసేవారికి
కన్నీరు తెప్పించేది ఉల్లి 
మోసినవారి కోసం
కన్నీరు భరించేది తల్లి

వంగూరి గంగిరెడ్డి 
9652286270
షాద్ నగర్

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

 మే 27న కేర‌ళ‌కు నైరుతి రుతుప‌వ‌నాలు   మే 27న కేర‌ళ‌కు నైరుతి రుతుప‌వ‌నాలు 
దిల్లీ: ఈ ఏడాది భారతదేశంలో నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే ముందే ప్రవేశించనున్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. సాధారణంగా జూన్ 1న కేరళలో రుతుపవనాలు ప్రవేశిస్తాయి....
కోట మశమ్మ పండుగకు గుంజి బజారు హమాలీలకు  ఆర్థిక సహకారం చేసిన
జుట్టు పెరుగుదలలో ప్రధాన పాత్ర పోషించేది ఏమిటో తెలుసా.....
పాకిస్తాన్‌లో పెట్రోల్ బంకులు క్లోజ్.. 
వంగూరి వాచకం -నవరత్నాలు
ఘనంగా ప్రారంభమైన బీచుపల్లి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు
అమ్మ ఎదురుచూపు