మే 27న కేరళకు నైరుతి రుతుపవనాలు
By Ram Reddy
On
దిల్లీ: ఈ ఏడాది భారతదేశంలో నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే ముందే ప్రవేశించనున్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. సాధారణంగా జూన్ 1న కేరళలో రుతుపవనాలు ప్రవేశిస్తాయి. అయితే ఈసారి మే 27న కేరళలో ప్రవేశించే అవకాశం ఉందని IMD తెలిపింది. దేశవ్యాప్తంగా జూలై 8 నాటికి ఈ రుతుపవనాలు వ్యాపించే అవకాశం ఉంది.
మధ్య మరియు పశ్చిమభారతంలో జూన్ 17న రుతుపవనాలు విస్తరించవచ్చని అంచనా. గతేడాది మే 29న, 2023లో మే 30న కేరళలో రుతుపవనాలు ప్రవేశించాయి.
ఈ ఏడాది ఎల్నినో ప్రభావం తగ్గి లానిన్యా ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా 52% ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని అంచనా. సెంట్రల్ ఇండియాలో సాధారణ కంటే ఎక్కువగా, ఉత్తరభారతంలో 40% ఎక్కువగా వర్షాలు పడే అవకాశం ఉంది. గతేడాది జూన్ నుంచి సెప్టెంబరు వరకు సగటున 18.2 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
10 May 2025 15:17:39
దిల్లీ: ఈ ఏడాది భారతదేశంలో నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే ముందే ప్రవేశించనున్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. సాధారణంగా జూన్ 1న కేరళలో రుతుపవనాలు ప్రవేశిస్తాయి....
Comment List