సీఎంతో డిన్నర్‌కి హాజరైన నాగార్జున, అల్లు అరవింద్..
లోకల్ గైడ్ :
హైదరాబాద్‌లో 72వ మిస్ వరల్డ్ 2025 పోటీలు ఇటీవల ఘనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. తాజాగా, నగరంలోని చారిత్రాత్మక చౌమహల్లా ప్యాలెస్‌లో మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల కోసం ప్రత్యేక విందు కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ విందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సతీమణితో కలిసి హాజరయ్యారు. కార్యక్రమంలో పలు దేశాల నుంచి వచ్చిన కంటెస్టెంట్లతో పాటు పలువురు ప్రముఖులు కూడా పాల్గొన్నారు.చౌమహల్లా ప్యాలెస్ 109 దేశాల కంటెస్టెంట్ల రాకతో రాత్రంతా వెలుగుల్లో మునిగిపోయింది. ఈ ఈవెంట్‌కు అక్కినేని నాగార్జున, అల్లు అరవింద్ కూడా హాజరయ్యారు. వారు సీఎం రేవంత్ రెడ్డి పక్కన కూర్చొని సరదాగా ముచ్చటిస్తూ కనిపించడంతో, ఈ దృశ్యం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.గతంలో రేవంత్ రెడ్డి సీఎం పదవి చేపట్టిన అనంతరం, నాగార్జునకు చెందిన 'ఎన్ కన్వెన్షన్ సెంటర్' కూల్చివేయడం జరిగింది. దీనిపై నాగార్జున అసంతృప్తి వ్యక్తం చేస్తూ, కోర్టులో పోరాటం చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే, సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్టు కావడం, అసెంబ్లీలో ఈ వ్యవహారంపై సీఎం ఘాటుగా స్పందించడం వంటి విషయాలు కూడా అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి. అప్పట్లో రేవంత్ అల్లు అర్జున్ పేరును ఉద్దేశపూర్వకంగా ప్రస్తావించలేదనే ఆరోపణలు కూడా వినిపించాయి.
అయితే ఇప్పుడు, రేవంత్ రెడ్డి – నాగార్జున – అల్లు అరవింద్ కలిసి విందులో పాల్గొనడం, హాస్యంతో ముచ్చట్లు చెప్పుకోవడం చూసిన నెటిజన్లు “అంతా ఆల్హ్యాపీస్” అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. అల్లు అర్జున్‌కి కూడా ఆహ్వానం పంపినట్టు తెలుస్తోంది, కానీ అందుబాటులో లేకపోవడంతో హాజరుకాలేకపోయినట్టు చెబుతున్నారు. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మొత్తంగా చూస్తే, గత వివాదాలపై తెర పడినట్టుగా ప్రజలు భావిస్తున్నారు.
Comment List