ఇసుక క్వారీని రద్దు చేయాలని బిజెపి ధర్నా
లోకల్ గైడ్
మిడ్జిల్ మండలంలోని కొత్తపల్లి దుందుభి వాగు నుండి ఇసుక తరలింపుకు అనుమతులు రద్దుచేసి ఇసుక కోరిని ఆపాలని మిడ్జిల్ మండల బిజెపి నాయకులు బుధవారం స్థానిక తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పల్లె తిరుపతి లు మాట్లాడుతూ ఇసుక వ్యాపారులకు మద్దతిస్తున్న స్థానిక తాసిల్దార్ రాజును వెంటనే సస్పెండ్ చేయాలని వారి డిమాండ్ చేశారు మిడ్జిల్ మండలంలో ఎర్రమట్టి కే ఎల్ ఐ కాల్వ మొరం అక్రమంగా తరలించడానికి తాసిల్దార్ రాజు అక్రమ వ్యాపారులకు ఇస్తున్నారని వారన్నారు అక్రమ సర్వే రిపోర్ట్ లు ఇచ్చి ఇసుక అనుమతులకు సహకరించిన తాసిల్దారును సస్పెండ్ చేయాలని వారు అన్నారు దేవాలయం భూములకు తప్పుడు లీగల్ కుటుంబ నిర్ధారణ సర్టిఫికెట్లు ఇచ్చి అక్రమాలకు పాల్పడుతున్న మిడ్జిల్ తహసిల్దారును వెంటనే సస్పెండ్ చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో బిజెపి మండల నాయకులు బుచ్చయ్య వెంకటేశు రామకృష్ణ భీమయ్య పిఎస్ఎస్ డైరెక్టర్ వాసుదేవ్ నరేష్ శేఖర్ మల్లేష్ హుస్సేన్ ప్రేమ్ గౌడ్ నరేష్ జంగల్య శేఖర్ అరవిందు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు
Comment List