భారత వాయుసేన చైనా వైమానిక రక్షణ వ్యవస్థను స్థంభింపజేసింది

 భారత వాయుసేన చైనా వైమానిక రక్షణ వ్యవస్థను స్థంభింపజేసింది

లోక‌ల్ గైడ్ :
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత రక్షణ దళాలు చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’లో భారత వైమానిక దళం గొప్ప విజయం సాధించింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా, పాకిస్థాన్‌ నియంత్రణలో ఉన్న ప్రాంతంలో — ముఖ్యంగా పీవోకే (పాక్ ఆక్రమిత కశ్మీర్‌) — ఉన్న 9 ఉగ్రవాద స్థావరాలను కేవలం 23 నిమిషాల్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యుద్ధవిమానాలు ధ్వంసం చేశాయి.ఈ దాడిలో పాకిస్థాన్ చైనాతో కలిసి ఏర్పాటు చేసిన అధునాతన వైమానిక రక్షణ వ్యవస్థలను భారత వాయుసేన విజయవంతంగా జామ్ చేసింది. వాయుసేన ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లు లక్ష్యాలను అచుక్కును చేరి ధ్వంసం చేయగలిగిన విధంగా పనిచేశాయి. పాకిస్థాన్ వ్యవస్థలు వాటిని గుర్తించడంలో పూర్తిగా విఫలమయ్యాయి. ఇది భారత వాయుసేన సాంకేతిక సామర్థ్యానికి తార్కాణమని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
ఇక మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే – ఈ ఆపరేషన్‌లో ఉపయోగించిన అన్ని రక్షణ సాంకేతిక పరికరాలు ‘100% మేడ్ ఇన్ ఇండియా’ కావడం గర్వకారణంగా నిలిచింది. చైనా తయారీ పీఎల్-15 క్షిపణులు, టర్కీకి చెందిన ‘యిహా’ యూఏవీలు, పాకిస్థాన్ ప్రయోగించిన దీర్ఘశ్రేణి రాకెట్లు, క్వాడ్‌కాప్టర్లు, వాణిజ్య డ్రోన్‌లను భారత వైమానిక రక్షణ వ్యవస్థలు సమర్థవంతంగా అడ్డుకొని పూర్తిగా నిర్వీర్యం చేశాయి.దీంతో భారత సైనిక స్థావరాలకు ఎటువంటి నష్టం లేకుండా విజయవంతంగా ఈ ఆపరేషన్‌ ముగిసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News