"లష్కర్ ఇన్వాల్వ్ అయిందా?"
పహల్గామ్ ఘటనపై పాకిస్తాన్‌పై యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆగ్రహం
పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాద దాడిపై పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రసంస్థ లష్కరే తోయ్బా ప్రమేయంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీవ్రంగా స్పందించింది. ఈ దాడిలో 25 మంది పర్యాటకులు, ఒక కాశ్మీరి గుర్రపు సవారీ నిర్వహకుడు ప్రాణాలు కోల్పోయారు.ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్ వేసిన ఆరోపణలు విఫలమయ్యాయి. పాకిస్తాన్ ఇటీవల నిర్వహించిన క్షిపణి పరీక్షలపై, అలాగే అణు భీకర వ్యాఖ్యలపై సభ్యదేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి.భద్రతా మండలిలోని ఇతర సభ్యులు — శాశ్వత సభ్యులైన చైనా, ఫ్రాన్స్, రష్యా, బ్రిటన్, అమెరికాతో పాటు, అల్జీరియా, డెన్మార్క్, గ్రీస్, గయానా, పనామా, దక్షిణ కొరియా, సియెరా లియోన్, స్లోవేనియా, సోమాలియా వంటి తాత్కాలిక సభ్యులు ఈ దాడిని ఖండించారు. బాధ్యులను శిక్షించాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. ఈ దాడిలో మత ఆధారంగా పర్యాటకులను లక్ష్యం చేసుకున్నట్లు వారు పేర్కొన్నారు.
పాకిస్తాన్ ప్రస్తుత పరిణామాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేయగా, భద్రతా మండలి సభ్యులు "ఇది ద్వైపాక్షికంగా పరిష్కరించుకోవాలని" సూచించారు. పాకిస్తాన్ ప్రచారం చేస్తున్న "ఫాల్స్ ఫ్లాగ్" సిద్ధాంతాన్ని వారు తిరస్కరించారు.ఈ సమావేశం అనంతరం పాకిస్తాన్ రాయబారి అసిమ్ ఇఫ్తికార్, తమ దేశం పహల్గామ్ దాడిలో ప్రమేయం లేదని పునరుద్ఘాటించారు. అలాగే భారత ప్రభుత్వం ఇండస్ వాటర్ ఒప్పందాన్ని రద్దు చేయడాన్ని అంతర్జాతీయ చట్టానికి విరుద్ధమని వ్యాఖ్యానించారు.యునైటెడ్ నేషన్స్ ప్రధాన కార్యదర్శి అంటోనియో గుటెరెష్ మాట్లాడుతూ, సైనిక పరిష్కారం సరైన దారి కాదని, ఇరు దేశాలు నిగ్రహంతో వ్యవహరించాలని సూచించారు. "సివిలియన్లపై దాడులు అంగీకారయోగ్యం కావు. బాధ్యులపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలి" అని ఆయన పేర్కొన్నారు.ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ దాడి గత కొన్ని దశాబ్దాల్లోనే అత్యంత ఘోరమైనదిగా భావించబడుతోంది. దాడిలో పాకిస్తాన్ సంబంధాలు వెలుగులోకి రావడంతో, భారత్ ఇండస్ వాటర్ ఒప్పందాన్ని నిలిపివేసి, పాకిస్తాన్ పౌరుల వీసాలను రద్దు చేసింది.
Comment List