తాటిచెట్టే విద్యుత్ స్తంభం 

- పట్టించుకోని విద్యుత్ శాఖ అధికారులు.

తాటిచెట్టే విద్యుత్ స్తంభం 

గద్వాల, లోకల్ గైడ్ :
 వ్యవసాయ పొలాల్లో సరిగా విద్యుత్ స్తంభాలు లేకపోవడం, ఉన్నవి విరిగిపోవడం ఇతర కారణాలవల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్తంభాలను కొనలేని పరిస్థితుల్లో కొంతమంది రైతులు కర్రలను, చెట్లను ఉపయోగించుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇందులో భాగంగానే జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం అడవి రావుల్ చెరువు గ్రామంలో ఓ రైతు విద్యుత్ స్తంభం లేక విద్యుత్ వైర్లను ఏకంగా పొలంలో ఉన్న తాటి చెట్టునే విద్యుత్ స్తంభంగా  ఉపయోగించు కుంటున్నారు. గ్రామానికి చెందిన బి. ఆంజనేయులు తండ్రి హనుమన్న తనకున్న నాలుగు ఎకరాల పొలానికి మోటార్ ద్వారా  నీళ్లు పారించేందుకు విద్యుత్ అవసరం ఉండటంతో కొంతమంది రైతులు కలిసి డిడి ద్వారా ట్రాన్స్ఫార్మర్లను పొందారు. పొలంలో ఒక ట్రాన్స్ఫార్మర్ విరిగిపోవడంతో గత్యంతరం లేక తాటిచెట్టు విద్యుత్ లైన్ తీయించు కున్నాడు. ఎన్నోసార్లు విద్యుత్ శాఖ అధికారులను సంప్రదించిన స్థంభం ఇవ్వడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. రానున్న వర్షాకాలంలో తాటి చెట్టు ద్వారా విద్యుత్ సరఫరా అయి ఏదైనా ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని గ్రామస్తులు తెలిపారు. విషయం విద్యుత్ అధికారులకు తెలిస్తే అర్ధాంతరంగా విద్యుత్తు లైన్ ను తీయిస్థారేమొనని, దీంతో పంటకు నీరందక నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆందోళనకు గురవుతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోక పోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి సంఘటనలు కోకొళ్లలుగా ఉన్నాయని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News