రైతన్నలు.. జర భద్రం 

రైతన్నలు.. జర భద్రం 

మార్కెట్లో విచ్చలవిడిగా దొరుకుతున్న నకిలీ విత్తనాలు

మరో 15 రోజుల్లో వానాకాలం ప్రారంభం

విత్తనాలు తీసుకునే ముందు జాగ్రత్తలు పాటిస్తే ఉత్తమం

అప్రమత్తతతోనే నకిలీలకు అడ్డుకట్ట

రసీదులు ఖచ్చితంగా తీసుకోవాలని అధికారుల సూచన


 లోకల్ గైడ్ ; వానాకాలం ముందుగానే వస్తుండటంతో రైతులు పంట పొలాలను దుక్కి దున్ని సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నెల 27 నుంచి నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. జాన్ మొదటి వారంలో వానాకాలం సీజన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రైతులు విత్తనాలు కొనడానికి సిద్ధమవుతున్నారు. అయితే కొనేముందు తగిన జాగ్రత్తలు తీసుకుంటే నకిలీ విత్తనాలకు చెక్ పెట్టవచ్చు. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా పంట దిగుబడి, కాలం వృథా అయ్యే ప్రమాదంతో పాటు అన్నదాతలు అప్పుల పాలవ్వడం ఖాయం. అందుకే విత్తనాలు కొన్న రైతులు ఖచ్చితంగా రసీదు, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం అలవాటు చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. రైతులకు వానాకాలం ముందుగానే వస్తుండటంతో సీజనకు ముందుగానే పంట పొలాలను దుక్కిదున్ని సిద్ధం చేసు కుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆకాల వర్షాలు కురవడంతో మంచి పదును అవుతుండటంతో దుక్కులు దున్నేస్తు న్నారు. అయితే మే 27 నుంచి నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతాయని వాతావరణ శాఖ మంచి శుభవార్త చెప్పింది. ఈ క్రమంలో అవి రాష్ట్రానికి చేరుకోవడానికి జూన్ మొదటి వారం కావచ్చు. జూన్ మొదటి వారంలో వానాకాల సీజన్ ప్రారంభం అవుతుంది. ఈ నేపథ్యంలో రైతులు విత్తనాలు కొనడానికి మార్కెట్లకు వెళుతూ ఉంటారు. అయితే కొనేముందు వారు తగిన జాగ్రత్తలు తీసుకుంటే నకిలీ విత్తనాలకు కళ్లెం వేయొచ్చు. ఏ మాత్రం ఏమరు పాటుగా ఉన్నా పంట దిగుబడి, పంట కాలం కాలం వృథా వృథా అయ్యే అయ్యే ప్రమాదంతోపాటు ప్రమాదంతో: రైతు అప్పులపాలు అవ్వడం ఖాయం.

కమీషన్ల కక్కుర్తిలో...

పల్లెల్లో అనధికారికంగా విత్తనాలు అమ్మే వారు కమీషన్ల కక్కుర్తిలో రైతు లకు నకిలీ విత్తనాలను అంటగడతారు. గత మూడేళ్లుగా ఇదే పరిస్థితి ఉంది. కొందరు రైతులు ఓ పత్తి విత్తన కంపెనీ నుంచి ఫౌండేషన్ తీసుకుని సాగు చేసిన
వారికి చేదు అనుభవం ఎదురైంది. వరి విత్తనాల్లో కంకి బయటకు వచ్చే దశలో కానీ దాని స్వరూపం బయటపడదు. మొక్కజొన్న, వేరుశెనగ పంట పూర్తయితే కానీ నకిలీ వల్ల జరిగిన నష్టం రైతుకు అర్ధం కాదు. ముఖ్యంగా పత్తి, వరి, మిరప, మొక్కజొన్న వంటి విత్తనా ల్లో నాసిరకం హవా ఎక్కువగా సాగు తోంది. అందుకే విత్తనాలు కొన్న రైతులు కచ్చితంగా రసీదు, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం అలవాటు చేసుకోవాలని వ్యవ సాయశాఖ అధికారులు హెచ్చరిస్తుంటా రు.

ఇవి తప్పనిసరి తెలుసుకోవాలి..

లైసెన్స్ ఉన్న అధీకృత దుకాణాల్లోనే విత్తనాలను కొనుగోలు చేయాలి. విత్తన మొలకశాతం సరిగా ఉందో లేదో చూసు కోవాలి. విత్తన ప్యాకెట్లపై లాట్ నంబర్, ప్యాకింగ్ తేదీ, లేబుల్ తదితరాలను పరిశీలిస్తూ ఉండాలి. కొనుగోలు చేసిన విత్తనాలకు రసీదు తప్పనిసరిగా తీసు కోవాలి. విత్తన ప్యాకెట్లపై క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాన్ని మొబైల్ స్కాన్ద్చేస్తే విత్తనాలకు సంబంధించిన పూర్తి వివ రాలు అనేవి ఆన్లైన్లో ప్రత్యక్షం అవు తాయి. నాటే కంటే ముందే కొన్ని విత్తనా లు తీసుకొని మొలక శాతం పరీక్షం చుకోవాలి. ముఖ్యంగా విత్తన సంచులు, రసీదులను భద్రపరుచుకోవడం మం చిది. తెలిసిన షాపులో విత్తనాలు కొంటే ఇంకా మంచిది.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ధ‌ర‌ణి వ‌ల్ల రైతులు నిద్ర‌లేని రాత్రులు గ‌డిపారు ధ‌ర‌ణి వ‌ల్ల రైతులు నిద్ర‌లేని రాత్రులు గ‌డిపారు
భూ భార‌తి ట్రిబ్యున‌ల్ ఏర్పాటు చేస్తాం ప‌ట్టాదారు పాసు పుస్త‌కంలో భూక‌మ‌తాల మ్యాపుల ముద్ర‌ణ‌ నిర్మ‌ల్ , ఆసిఫాబాద్ జిల్లాల భూభార‌తి స‌ద‌స్సుల్లో  రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్‌,...
రైతన్నలు.. జర భద్రం 
కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు చేస్తున్న, మత్స్య శాఖ ఏడి
రీస్టార్ట్‌కు రంగం సిద్ధం.. రేపటి నుంచే ఐపీఎల్‌
ప్రజల ఆరోగ్యానికి ప్రధాన శత్రువులు దోమలు 
ఫ్యూచర్‌సిటీలో భూగర్భంలో  పూర్తిగా విద్యుత్ లైన్లు :   సీఎం రేవంత్ రెడ్డి 
స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రత పటిష్టంగా ఉండాలి