రీస్టార్ట్‌కు రంగం సిద్ధం.. రేపటి నుంచే ఐపీఎల్
ఐపీఎల్ వారం రోజుల విరామం అనంతరం తిరిగి ప్రారంభమయ్యేందుకు సిద్ధమైంది. శనివారం నుంచి మళ్లీ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. బెంగళూరు వర్సెస్ కోల్‌కతా మ్యాచ్‌తో ఈ సీజన్ మళ్లీ ప్రారంభం అవుతుంది. భారత్–పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో తమ దేశాలకు వెళ్లిన విదేశీ ఆటగాళ్లు మళ్లీ ఫ్రాంచైజీలకు చేరుతున్నారు. ఇప్పటికే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ క్రికెటర్లు భారత్‌కు తిరిగొచ్చారు. జోస్ బట్లర్, కగిసొ రబాడా (గుజరాత్) గురువారమే జట్టుతో చేరారు.
ఆర్‌సీబీకి ఫిల్ సాల్ట్, లివింగ్‌స్టోన్, బెతెల్, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్ చేరారు. మార్క్రమ్, మిల్లర్, పూరన్, జోసెఫ్ మరో రెండు రోజుల్లో లక్నో జట్టుతో కలవనున్నట్టు సమాచారం. మే 19న లక్నో – సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ ఉండగా, అంతకుముందే వీరు జట్టులో చేరే అవకాశముంది. హైదరాబాద్ కెప్టెన్ కమిన్స్‌తో పాటు ట్రావిస్ హెడ్ కూడా త్వరలో భారత్‌కు రానున్నారు. మిచెల్ స్టార్క్ రాకపై ఇంకా స్పష్టత రాలేదు. ట్రిస్టన్ స్టబ్స్, డుప్లెసిస్ త్వరలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో కలవనున్నారు.
Comment List