ఫ్యూచర్‌సిటీలో భూగర్భంలో  పూర్తిగా విద్యుత్ లైన్లు :   సీఎం రేవంత్ రెడ్డి 

ఫ్యూచర్‌సిటీలో భూగర్భంలో  పూర్తిగా విద్యుత్ లైన్లు :   సీఎం రేవంత్ రెడ్డి 

హైదరాబాద్:
వచ్చే మూడేళ్లలో విద్యుత్ వినియోగం బాగాపెరిగే అవకాశం ఉన్నందున, సబ్స్టేషన్లను అప్గ్రేడ్ చేయడం సహా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యుత్ శాఖపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి సీఎం సమీక్ష నిర్వహించారు."హైదరాబాద్ త్వరలో డేటా సెంటర్ల కేంద్రంగా మారనుంది. ఈ నేపథ్యంలో విద్యుత్ లైన్ల ఆధునికీకరణకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఫ్యూచర్‌సిటీలో విద్యుత్ లైన్లు పూర్తిగా భూగర్భంగా ఉండేలా చూడాలి. అక్కడ ఎలాంటి టవర్లు, లైన్లు, స్తంభాలు కనిపించకూడదు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రయోగాత్మకంగా స్మార్ట్ పోల్స్‌ను ఏర్పాటు చేయాలి. ఓఆర్ఆర్ ప్రాంతంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు రూపొందించాలి" అని సీఎం సూచించారు.ఈ ఏడాది విద్యుత్ డిమాండ్ 17,162 మెగావాట్లకు చేరిందని, ఇది గత ఏడాదితో పోలిస్తే 9.8 శాతం పెరిగిందని అధికారులు తెలిపారు. 2025-26 నాటికి డిమాండ్ 18,138 మెగావాట్లకు, 2034-35 నాటికి 31,808 మెగావాట్లకు చేరుతుందని వారు అంచనా వేశారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ధ‌ర‌ణి వ‌ల్ల రైతులు నిద్ర‌లేని రాత్రులు గ‌డిపారు ధ‌ర‌ణి వ‌ల్ల రైతులు నిద్ర‌లేని రాత్రులు గ‌డిపారు
భూ భార‌తి ట్రిబ్యున‌ల్ ఏర్పాటు చేస్తాం ప‌ట్టాదారు పాసు పుస్త‌కంలో భూక‌మ‌తాల మ్యాపుల ముద్ర‌ణ‌ నిర్మ‌ల్ , ఆసిఫాబాద్ జిల్లాల భూభార‌తి స‌ద‌స్సుల్లో  రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్‌,...
రైతన్నలు.. జర భద్రం 
కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు చేస్తున్న, మత్స్య శాఖ ఏడి
రీస్టార్ట్‌కు రంగం సిద్ధం.. రేపటి నుంచే ఐపీఎల్‌
ప్రజల ఆరోగ్యానికి ప్రధాన శత్రువులు దోమలు 
ఫ్యూచర్‌సిటీలో భూగర్భంలో  పూర్తిగా విద్యుత్ లైన్లు :   సీఎం రేవంత్ రెడ్డి 
స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రత పటిష్టంగా ఉండాలి