కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు చేస్తున్న, మత్స్య శాఖ ఏడి
పందిళ్ళపల్లి మత్స్యశాఖ సొసైటీ, అక్రమాలను అరికట్టాలి..
-- ఖమ్మం ప్రెస్ క్లబ్ విలేకరుల సమావేశంలో బాధితులు
- సింగారపు వీరభద్రం, వీరమల్లు, లింగం సైదులు..
లోకల్ గైడ్: ఖమ్మం:
చింతకాని మండలం పందిళ్ళపల్లి (పెద్దచెరువు) మత్స్య సహకార సొసైటీలో గత 12 ఏండ్లుగా జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని, వారసత్వ సభ్యత్వం పేరుతో వసూళ్లకు పాల్పడిన సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు, కమిటీని రద్దు చేయాలని బాధితులు సింగారపు వీరమల్లు, సింగారపు వీరభద్రం, లింగం సైదులు అన్నారు. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ... పందిళ్ళపల్లి (పెద్దచెరువు) మత్స్య సహకార సొసైటీలో సుమారు 149 మంది సభ్యులు ఉన్నారన్నారు. సొసైటీ అధ్యక్ష కార్యదర్శులుగా లింగబోయిన వెంకటేశ్వర్లు(బుజ్జి), షేక్ సైజాని, 9 మంది సభ్యులు ఉన్నారన్నారు. సొసైటీ 149 మంది సభ్యులలో సుమారు 48 మంది తండ్రులు చనిపోతే వారసత్వంగా వారి కొడుకులకు సభ్యత్వం పేరుతో రూ. 6వేల నుండి ఎక్కువ మొత్తంలో వసూలు చేసి సభ్యత్వం ఇవ్వకుండా మత్స్య శాఖ ఏడికి ఇతరులకు ఇచ్చామని 12 ఏళ్లుగా కాలయాపన చేస్తూ మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇట్టి విషయమై మత్స్య శాఖ ఏడికి మూడుసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదన్నారు. గ్రీవెన్స్ లో కలెక్టర్కు ఫిర్యాదు చేశామని, కలెక్టర్ ఆదేశాలు కూడా మత్స్యశాఖ ఏడి బేఖాతర్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారసత్వ సభ్యత్వం పేరుతో నాలుగైదు లక్షలు, అదేవిధంగా కొత్త సభ్యుల పేరుతో 50 మంది దగ్గర రూ.50 వేల రూపాయలను పందిళ్ళపల్లి మత్స్య శాఖ సహకార సొసైటీ, మత్స్యశాఖ ఏడి సహకారంతోనే ఈ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గతంలో అక్రమాలకు పాల్పడిన ఏడి సస్పెండ్ అయిన అధికారులకు బుద్ధి రావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అధికారులు విచారణ జరిపి న్యాయం చేయాలని బాధితులు వేడుకున్నారు.
Comment List