మోడీ ప్రభుత్వ ఆదేశాలతో రెచ్చిపోతున్న అటవీశాఖ
గిరిజనులతో మాట్లాడుతున్న సిపిఎం నాయకులు...
2006 అటవీ హక్కుల చట్టాన్ని అమలు చెయ్యలి.....
సిపిఎం జిల్లా కార్యదర్శి సంకె రవి..
లోకల్ గైడ్ మంచిర్యాల.
అధికారంలో ఉండి కూడ చట్టాన్ని అమలు చేయని బిజెపి,కాంగ్రెస్,బిఆర్ఎస్ పార్టీలు ప్రజలకు సమాధానం చెప్పాలని సిపిఎం జిల్లా కార్యదర్శి సంకె రవి డిమాండ్ చేశారు.కోటపల్లి మండలంలోని లింగన్న పెట,రొయ్యలపల్లి గ్రామల్లోని ఆదివాసీలు,పేదలతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.2006అటవీ హక్కుల చట్టం వచ్చి19 సంవత్సరాలు గడిచిపోయిన నేటికీ పోడు సాగులో ఉన్న భూములకు హాక్కు పత్రాలివ్వలేదన్నారు.కానీ చట్టాన్ని అమలు చెయ్యని ప్రభుత్వాలు,ఫారెస్ట్ శాఖ అధికారులు,నేడు పోడు సాగుదారులను వ్యవసాయం చేయవద్దని గ్రామాల్లో ప్రజలను బెదిరించడం ఎంతో వరకు సమంజసం అని ప్రశ్నించారు. పోడు వ్యవసాయదారులను వేధించడం మానుకొని ముందు చట్టాన్ని అమలు చేసి చట్ట ప్రకారం హక్కు పత్రాలివ్వాలని డిమాండ్ చేసారు.2006 అటవీ హక్కుల చట్టం వచ్చినప్పటి నుండి కేంద్రంలో,రాష్ట్రంలో అధికారాన్ని అనునుభవిస్తున్న బిజెపి,కాంగ్రెస్,బిఆర్ఎస్ పార్టీల ప్రతినిధుల మూలంగానే ఫారెస్ట్ శాఖ అధికారుల జిల్లాలో రెచ్చిపోతున్నారని ఆరోపించారు.చట్టప్రకారంగా సాగులో ఉన్న ప్రతి ఎకరాకు హక్కు పత్రాలివ్వాలి,ఫారెస్ట్ శాఖ అధికారుల దౌర్జన్యాలు,బెదిరింపులు నిలిపివేయాలి లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కుర్మ పున్నం,ఉపాధ్యక్షురాలు సిడాం సమ్మక్క,స్థానికులు నాయిని భీమయ్య,ఆత్రం చిన్నన్న,బాగల సమ్మయ్య,బాగల చంద్రన్న,కరపేత పొట్టి,ఆత్రం శ్రావణ్,ఆత్రం సంపత్ తదితరులు పాల్గొన్నారు.
Comment List