ఇసుక రిచ్ ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే..

మాటలు కాదు అభివృద్ధి చేసి చూపిస్తాను...

ఇసుక రిచ్ ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే..

మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేం సాగర్ రావు.

లోకల్ గైడ్ మంచిర్యాల.

మంచిర్యాల కార్పోరేషన్ పరిధిలోని నస్పూర్ మున్సిపాలిటీ తాళ్ళపెల్లి గ్రామంలో ఇసుక రిచ్ ను మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేం సాగర్ రావు శనివారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతు ఇసుక అక్రమ రవాణాన అరికట్టేందుకే ఆన్ లైన్  సేవలు ప్రారంభించినట్లు తెలిపారు.ప్రజలు ఇసుకను ఆన్ లైన్ సేవల ద్వారా ప్రభుత్వం నుండి పొందాలని అక్రమ ఇసుక రవాణా దారులకు సహకరించవద్దని కోరారు.ఇకనుండి నియోజకవర్గంలో అక్రమ ఇసుక రవాణా ఉండబోడదని తెలిపారు.అనంతరం మంచిర్యాల పట్టణంలోని మార్కెట్ చౌరస్తాలో స్థానిక వ్యాపారస్తులతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.మంచిర్యాల నగరపాలక సంస్థలోని వ్యాపార ప్రాంతాల రహదారుల సుందరీకరణకు 78కోట్ల రూపాయలు మంజూరైనట్లు ఎమ్మెల్యే తెలిపారు.మార్కెట్ రోడ్,శ్రీనివాస టాకీస్ రోడ్,వాటర్ ట్యాంక్,వెంకటేశ్వర టాకీస్,శ్రీ విశ్వనాథ ఆలయం,కాలేజ్ రోడ్ లు సుందరీకరణకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు.రహదారుల విస్తరణ,భూగర్భ మురికి కాలువలు,ఫుట్ పాత్ నిర్మాణ పనులను జూన్ మాసంలో ప్రారంభించనున్నట్లు తెలిపారు.ఆలయం దుకాణాల సముదాయంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కట్టడాలను తొలగిస్తామన్నారు.తన ఇంటి ముందు నుంచి టూ టౌన్ అనుసంధానంగా ఓవర్ బ్రిడ్జి నిర్మాణం మరో 2నెలలలో చేపట్టనున్నట్లు తెలిపారు.2027 లోపు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించి ప్రజలకు అంకితం చేస్తానని ధీమా వ్యక్తం చేశారు.ఆసుపత్రిలో పేద వారికి ఆధునిక వైద్య సేవలు అందిస్థానని భరోసా ఇచ్చారు.వేంపల్లిలో ఇండస్త్రీయల్ పార్కు ఏర్పాట్ల ప్రక్రియ వారం రోజుల్లో పూర్తవుతుందని తెలిపారు.లే అవుట్,భూమి కేటాయింపు ఎలా అనే అంశాలపై నిర్ణయం తీసుకుని సకల సౌకర్యాలతో వ్యాపారస్తులకు భూమి విక్రయించనున్నట్లు ఆయన తెలిపారు.ఐటి పార్కులో తాను కూడా అందులో కోడిగుడ్ల ఎగుమతి,మామిడి ఇతర పండ్లు నిలువ చేసే కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయన్నట్లు తెలిపారు.ముల్కల్ల నుండి గోదావరి నదిపై వంతెన నిర్మాణం ప్రక్రియ జరుగుతోందని,అదేవిధంగా ఐటీ పార్కుకు అనుసంధానంగా బసంత్ నగర్ వద్ద విమానాశ్రయం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందని తెలిపారు.45కోట్లతో ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపర్చడం వలన విద్యార్థుల సంఖ్య 4వేల800 పెరిగిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తన నిర్ణయం నచ్చడంతో రాష్ట్రంలోని పాఠశాలల్లో సౌకర్యాల కల్పనకు పూనుకున్నారని తెలిపారు. 

అభివృద్ధిపై చర్చకు సిద్ధమా?

అభివృద్ధి విషయంలో ఎవరు చర్చకు వచ్చిన లెక్కలతో సహా వివరించడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన సవాల్ చేశారు.బిఆర్ఎస్ లా జీఓ లు తీసుకువచ్చి పాలాభిషేఖం చేయడం లేదని పక్కాగా నిధులు తీసుకువస్తున్నానని తెలిపారు.వచ్చే శాసనసభ ఎన్నికల ఏడాది ముందు అభివృద్ధి పనులు పూర్తిచేసి ప్రజల్లో మమేకం అవుతానని తెలిపారు.అంతేకాకుండా స్పోర్ట్స్ స్టేడియం నిర్మించాల్సి ఉందని,నియోజకవర్గంలో 6వేల మందికి రాజీవ్ యువశక్తి పథకం అందిస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఉపాధ్యాయులే సమాజ నిర్మాతలు:  ఉపాధ్యాయులే సమాజ నిర్మాతలు: 
నిర్మల్, లోకల్ గైడ్: ఉపాధ్యాయులే సమాజ నిర్మాణానికి మూలస్తంభాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. పట్టణంలోని నారాయణ ఒలంపియాడ్ పాఠశాలలో శనివారం నుంచి ప్రారంభమైన ఐదు...
మోడీ ప్రభుత్వ ఆదేశాలతో రెచ్చిపోతున్న అటవీశాఖ
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు పంపిణీ..
ఎన్‌ఈఈటీ-యూజి ఫలితాలపై మధ్యంతర స్టే – మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశం | Local Guide
ముస్తాఫిజుర్ రహ్మాన్‌కు BCB నుంచి NOC – ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఊరట | Local Guide
ఇసుక రిచ్ ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే..
మిచెల్ స్టార్క్ IPL 2025 నుంచి వైదొలిగిన విషయం ధృవీకరణ – ఢిల్లీ క్యాపిటల్స్‌కు గట్టి ఎదురుదెబ్బ | లోకల్ గైడ్