మాజీ ఎంపిపి తనయుడు సన్వవల్లి ఆంజనేయులు చొరవతో గుర్రంపల్లిలో నూతన విద్యుత్ ట్రాన్స్ ఫారం ఏర్పాటు

ఎమ్మెల్యే శంకరన్నకు ధన్యవాదములు తెలిపిన గుర్రంపల్లి (జిల్లెలగడ్డ)రైతులు.

మాజీ ఎంపిపి తనయుడు సన్వవల్లి ఆంజనేయులు చొరవతో గుర్రంపల్లిలో నూతన విద్యుత్ ట్రాన్స్ ఫారం ఏర్పాటు

లోకల్ గైడ్ తెలంగాణ, జిల్లేడు చౌదరిగూడెం: జిల్లేడు చౌదరిగూడెం మండల మాజీ ఎంపిపి సన్వవల్లి యదమ్మ తనయుడు ఆంజనేయులు గుర్రంపల్లి గ్రామ( జిల్లెల్ల గడ్డ) రైతుల ఇబ్బందులను గుర్తించి శనివారం నూతన విద్యుత్ ట్రాన్స్ ఫారం ఏర్పాటు చేసి ఓవర్ లోడు కరెంట్ సమస్యను పరిష్కారం చేశారు. చాలా రోజుల నుండి ఓవర్ లోడ్ కరెంటు సమస్యలతో ఇబ్బందులకు గురవుతున్నామని గుర్రంపల్లి జిల్లెలగడ్డ రైతులు సన్వవల్లి ఆంజనేయులు దృష్టికి తీసుకెళ్ళారు.దీంతో వారు తమ గ్రామ రైతుల కరెంటు సమస్యను తీర్చాలని ఎమ్మెల్యే సంకరన్నకు విన్నవించారు. దీంతో ఎమ్మెల్యే తక్షణమే స్పందించి డిఇ శ్యాంసుందర్ రెడ్డి, ఎఈ రవికుమార్ ను నూతన ట్రాన్స్ ఫారం ఎర్పాటు చేయాలని అదేశించగా వెంటనే విద్యుత్ అధికారులు ఓవర్లోడ్  సమస్యను తీర్చడానికి నూతన ట్రాన్స్ ఫార్మర్ ను ఏర్పాటుచేశారు. 
రైతుల సమస్యలపై తక్షణమే స్పందించి తీర్చినందుకు ఎమ్మెల్యే శంకరన్నకు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చలి వేంద్రoపల్లి రాజుకు, మాజీ ఎంపిపి తనయుడు సన్వవల్లి. ఆంజనేయులుకు, విద్యుత్ అధికారులకు గుర్రంపల్లి జిల్లెల గడ్డ రైతులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తనయుడు సన్వవల్లి ఆంజనేయులు,భైరంపల్లి మల్లయ్య, రాములు, రామచంద్రయ్య, యాదయ్య, తదితరులు పాల్గోన్నారు.

Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

మాజీ ఎంపిపి తనయుడు సన్వవల్లి ఆంజనేయులు చొరవతో గుర్రంపల్లిలో నూతన విద్యుత్ ట్రాన్స్ ఫారం ఏర్పాటు మాజీ ఎంపిపి తనయుడు సన్వవల్లి ఆంజనేయులు చొరవతో గుర్రంపల్లిలో నూతన విద్యుత్ ట్రాన్స్ ఫారం ఏర్పాటు
లోకల్ గైడ్ తెలంగాణ, జిల్లేడు చౌదరిగూడెం: జిల్లేడు చౌదరిగూడెం మండల మాజీ ఎంపిపి సన్వవల్లి యదమ్మ తనయుడు ఆంజనేయులు గుర్రంపల్లి గ్రామ( జిల్లెల్ల గడ్డ) రైతుల ఇబ్బందులను...
ఉపాధ్యాయులే సమాజ నిర్మాతలు: 
మోడీ ప్రభుత్వ ఆదేశాలతో రెచ్చిపోతున్న అటవీశాఖ
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు పంపిణీ..
ఎన్‌ఈఈటీ-యూజి ఫలితాలపై మధ్యంతర స్టే – మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశం | Local Guide
ముస్తాఫిజుర్ రహ్మాన్‌కు BCB నుంచి NOC – ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఊరట | Local Guide
ఇసుక రిచ్ ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే..