పదవి కోసమే ఆరాటం
By Ram Reddy
On
పదవి కోసమే ఆరాటం
-----------------------------------
పదవి మబ్బులా మారిపోతూ
కాల గమనంలో కలుస్తుంది
నిన్నటి నవ్వులు,రేపటి ఆశలు కలకాలం ఎప్పటికీ ఉండవు
ఆనందం దుఃఖం కొంతకాలమే
సంతోషపు క్షణాలు అశాశ్వతం
ప్రేమ,దయా కరుణ శాశ్వతం
అధికారం ఉన్నప్పుడే అన్ని సఫలం
అధికారం పోతే అన్ని విఫలమే..
ప్రేమ ఉంటే నమ్మకం చదరదు
జ్ఞానం నిత్యం ప్రకాశించే వెలుతురే
శాశ్వతం కానిది వెళ్ళిపోతుంది
శాశ్వతమైనది నీతోనే ఉంటుంది
నిజాయితీ తోడైతే ప్రతిష్ట పెరుగును
పదవి నీడలా మాయమైపోతుంది
మంచి పేరు ఎప్పటికి నిలుస్తుంది.
ధనం,సంపద నీ వెంట రావు కదా
మంచి జనం మనసుల్లో సుస్థిరం....
నిజాయితీతో వేసిన అడుగులు
జీవితంలో ఎప్పటికీ గుర్తుంటాయి
ఓ మనిషి అధికారంతో గర్వించవద్దు,
పదవి పోయిందని దిగులుపడవద్దు.
ఆకాశంలో ధ్రువతార వలె ఎప్పటికీ ప్రకాశిస్తూనే ప్రజల గుండెల్లో నీవే...
🙏🏻🙏🏻
వి.జానకి రాములు గౌడ్
లింగంధన
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
16 May 2025 17:42:59
భూ భారతి ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తాం
పట్టాదారు పాసు పుస్తకంలో భూకమతాల మ్యాపుల ముద్రణ
నిర్మల్ , ఆసిఫాబాద్ జిల్లాల భూభారతి సదస్సుల్లో
రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్,...
Comment List