నటి సాయి ధన్సిక తో హీరో విశాల్ త్వరలో పెళ్లి.......
లోకల్ గైడ్:
హీరో విశాల్, నటి సాయి ధన్సిక త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు సోమవారం ఉదయం నుంచి కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతుంది. దీనిపై వారు తాజాగా అధికారికంగా స్పందించారు. చెన్నైలో జరిగిన ఓ సినిమా ఈవెంట్‌లో వీరిద్దరూ కలిసి తమ పెళ్లి విషయాన్ని ప్రకటించారు. వివాహం ఈ ఏడాది ఆగస్టు 29న జరుగుతుందని, అదే రోజున విశాల్ పుట్టినరోజు కూడా కావడం విశేషం.
ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ, "సాయి ధన్సిక మంచి వ్యక్తి. మేము కలిసి కొత్త జీవితం ప్రారంభించబోతున్నాం. పెళ్లి తర్వాత కూడా ఆమె నటన కొనసాగిస్తుంది," అన్నారు. ధన్సిక కూడా స్పందిస్తూ, "కొంతకాలంగా మా మధ్య పరిచయం ఉంది. అది ప్రేమగా మారింది. విశాల్ ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నా," అని చెప్పారు.
రజనీకాంత్ ‘కబాలి’లో కీలక పాత్ర పోషించిన ధన్సిక, ‘షికారు’, ‘అంతిమ తీర్పు’, ‘దక్షిణ’ వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో విశాల్ వివాహం గురించి పలు రూమర్లు వచ్చినా, "నడిగర్ సంఘం భవనం పూర్తయ్యాకే పెళ్లి చేసుకుంటా" అని ఆయన వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆ భవనం పూర్తి కావడంతో, "త్వరలో పెళ్లి జరుగుతుంది. ఇది ప్రేమ వివాహమే" అని మీడియాతో చెప్పారు.
ఈమధ్య ధన్సిక నటించిన యాక్షన్ మూవీ ‘యోగీ దా’ ఆడియో, ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు విశాల్ ముఖ్య అతిథిగా హాజరవుతారని ప్రకటించడంతో, వారి పెళ్లి వార్తలకు బలం చేకూరింది. అదే వేదికపై ఈ జంట తమ పెళ్లిని అధికారికంగా ప్రకటించి అభిమానులకు శుభవార్త చెప్పారు.
Comment List