ఎన్టీఆర్ ఓ యుగ పురుషుడు, ఆయనకు భారత రత్న పురస్కారం ఇవ్వాలి
షాద్ నగర్ లో ఘనంగా ఎన్టీఆర్ 102వ జయంతి వేడుకలు
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ పరిధిలోని ఎంపీ శేషయ్య నగర్ కమ్యూనిటీ హాల్ నందు 102 వ జయంతి వేడుకలను షాద్ నగర్ కమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నందమూరి తారక రామారావు విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు . ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి కమ్మ సేవా సమితి షాద్ నగర్ డివిజన్ అధ్యక్షులు పాతూరి వెంకట్రావు మాట్లాడుతూ.. తెలుగునేల పులకించి పోయే తెలుగు బిడ్డ, తెలుగు ప్రజలందరి చేత అన్నగారు అనిపిలిపించుకున్న మహానేత, దక్షిణ భారతదేశంలో పుట్టిన ముద్దుబిడ్డ చరిత్ర మరువని యుగపురుషుడు మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు అని తెలుగు నేల ఉన్నంత వరకూ ఆయన చిరస్మరణీయుడనీ, తెలుగు వారి సామాజిక రాజకీయ జీవనంలో ఎన్టీఆర్‌ది ఓ కీలక ఘట్టం అనీ ఆ మహానాయకుడి శత జయంతి ఉత్సవాలను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటున్నారనీ కొనియాడారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి ఆయన చేసిన గొప్ప సేవలను తెలుగు ప్రజలు ఎన్నటికీ మర్చిపోరని కొనియాడారు. ఆయన ఆలోచనలు అజరామరం.. ఆయన నాయకత్వం అద్భుతాల నిలయం.. ఆయన దారి అనితరసాధ్యం.. అంటూ కీర్తించారు. భారతీయ సినిమాపైనే కాకుండా దేశ రాజకీయాల్లోనూ చెరగని ముద్రవేసి తనదైన చరిత్రను సువర్ణాక్షరాలతో లిఖించుకున్న మహనీయుడు ఎన్టీఆర్ అనీ, కృషి ఉంటే మనుషులు రుషులవుతారనే పదానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచి చరిత్రలో యుగ పురుషుడిగా నిలిచిపోయిన ఎన్టీఆర్ శత జయంతి అందరికీ పండగ లాంటిదని అన్నారు. ఆయనకు గౌరవ ప్రదమైన భారత రత్న పురస్కారం ఇవ్వాలి అని అయిన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కమ్మ సేవా సమితి నాయకులు బండారుపల్లి నాగేశ్వర రావు, పాతూరి సత్యనారాయణ, పినపాక ప్రభాకర్ , గుదే వసంత రావు, , మక్కపాటి మల్లేశ్వర రావు, నువ్వుల నాగేశ్వరరావు, ఆలపాటి పూర్ణ, కూకట్ల సత్యనారాయణ, రామ సుబ్బారావు, కొడాలి సురేష్, కృష్ణారావు, కోలారు సాంబయ్య, ఎర్రగుంట్ల శ్రీనివాసరావు, నాగేశ్వర రావు, కోటేశ్వర రావు, కట్టా అప్పారావు, గుదే మస్తాన్ రావు, కంకల్ శ్రీను, కట్టా హరి, కొత్త ప్రభాకర్, కొర్రపాటి శ్రీనివాస్, కనుమూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Comment List