ఈనెల 25 వరకు హ్యాండ్లూమ్ టెక్నాలజీలో మూడేళ్ల కోర్స్ దరఖాస్తులు
గద్వాల, లోకల్ గైడ్ :
కొండా లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీలో మూడేళ్ల డిప్లమో ఇన్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ కోర్స్ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని టీ.ఎస్. సి .ఓ. రతన్ కుమార్ అన్నారు. శుక్రవారం చేనేత, జౌల శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు గద్వాల పట్టణంలోని జివేశ్వర నిలయంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అధికారి టీ.ఎస్. సి .ఓ. రతన్ కుమార్ హైదరాబాద్ హాజరై మాట్లాడుతూ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీలో కోర్స్ కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 60శాతం సీట్లు కేటాయించిం దన్నారు. పదవ తరగతి పాస్ అయిన విద్యార్థులు మూడు సంవత్సరాలు కోర్స్, ఇంటర్ పాసైన విద్యార్థులు రెండు సంవత్సరాలు కోర్స్ ఉంటుందని అన్నారు. డిప్లమా అండ్ హ్యాండ్లూమ్ టెక్స్టైల్ టెక్నాలజీ డి.హె చ్.టీ.టీ. కోర్సు చేయడానికి సంవత్సరానికి ఫీజు రూ.6000 ఉంటుందని, ఈ కోర్స్ మొత్తం మూడు సంవత్సరాలు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు నెలవారిగా 2500 రూపాయలు ప్రతినెల స్టైఫండ్ అందిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్. హెచ్. డి .సి. పథకం కింద నెలకు 5000 రూపాయలు అదనపు స్టైఫండ్ ఇస్తుందని, ప్రతి సంవత్సరం రెండు జతల యూనిఫాంలు ఉచితంగా అందించబడతాయని అన్నారు. అర్హత గల విద్యార్థి, విద్యార్థినులు ఈనెల 25 వరకు దరఖాస్తులు అసిస్టెంట్ డైరెక్టర్ హ్యాండ్ టెక్స్టైల్స్ గద్వాల వారికి ఇవ్వగలరని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా చేనేత జోలి శాఖ సహాయ సంచాలకులు గోవిందయ్య, డివో సుధారాణి, ఏ డి ఓ ప్రియాంక, ఏ డి ఓ ఉపేందర్, క్లస్టర్ సి.డి.ఈ. మహేష్, చేనేత మాజీ ఆప్కో డైరెక్టర్ గట్టు వీరన్న, రాజోలి, ఐజ, గొర్లఖాన్దొడ్డి, మల్లంపల్లి , గట్టు, హెక్లాస్పూర్ గ్రామాల చేనేత సంఘం నాయకులు, చేనేత కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.
Comment List