శిల్పారామంలో ప్రపంచ సుందరీమణుల సందడి
లోకల్ గైడ్, రంగారెడ్డి : 72వ ప్రపంచ అందాల పోటీల్లో పాల్గొంటున్న సుందరిమణులు గురువారం ఉదయం మాదాపూర్ లోని శిల్పారామం సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ప్రపంచ సుందరీమణులకు శిల్పారామం ప్రధాన ద్వారం వద్ద స్వాగతం పలికారు. బంజారా నృత్యాలతో, మొక్కలతో అందాల భామలకు స్వాగతం పలికారు. తదుపరి సుందరిమణులు మహిళలతో బతుకమ్మ ఆడారు. శిల్పారామంలో స్టాల్స్ ను తిలకించి నృత్య ప్రదర్శనలతో కోలాహలంగా ఆటలు ఆడారు. మహిళా శక్తి బజారులో స్టాల్స్ ను రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కతో కలిసి అన్ని స్టాల్స్ ను తిలకించారు. మహిళా శక్తి గురించి, మహిళ గ్రూప్ ల గురించి వారు సాధిస్తున్న విజయాల గురించి సెర్ఫ్ సీఈవో దివ్యప్రపంచ సుందరీమణులకు వివరించారు. అనంతరం శిల్పారామంలో కుండలు తయారు చేయువిధానాన్ని నిర్వాహకులు సుందరీమణులకు వివరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి సెర్ఫ్ సీఈవో దివ్య శిల్పారామం ఇంచార్జ్, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు
Comment List