ట్రంప్‌ సంచలన ప్రకటన......

ట్రంప్‌ సంచలన ప్రకటన......

లోక‌ల్ గైడ్ : మూడో ప్రపంచ యుద్ధం రాకుండా ఆపేస్తానని, చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా అక్రమ వలసదారులను దేశం నుంచి బయటకు పంపిస్తానని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) అన్నారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా మరికొన్ని గంటల్లో ట్రంప్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా వాషింగ్టన్‌ డీసీలో నిర్వహించిన ‘మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగెయిన్‌ విక్టరీ ర్యాలీని ఉద్దేశించి ట్రంప్‌ ప్రసంగించారు. ర్యాలీకి చాలా మంది స్నేహితులు, మద్దతుదారులు, నిజమైన అమెరికన్‌ దైశభక్తులు హాజరైనందుకు సంతోషంగా ఉందన్నారు. మన దేశాన్ని మనం తిరిగి స్వాధీనం చేసుకోబోతున్నాం. రేపు మధ్యాహ్నం నాటికి నాలుగేండ్ల అమెరికా క్షీణతకు తెరబడపోతున్నది. అమెరికన్‌ బలం, శ్రేయస్సు, గౌరవం, గర్వంతో సరికొత్త రోజును ప్రారంభించబోతున్నాం.తాను ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మన దేశంపై అక్రమ వలసదారుల దండయాత్ర ఆగిపోతుంది. సరిహద్దుల నుంచి అక్రమంగా ప్రవేశించడాన్ని ఆపేస్తాం. ఇక మన సంపదను మనమే అనుభవిస్తాం. అక్రమంగా వలస వచ్చిన వేలాది మందిని బలవంతంగా సాగనంపే కార్యక్రమం అమెరికా చరిత్రలోనే భారీగా మొదలు పెడతాం.ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తాం. టిక్‌టాక్‌ యాప్‌ను మళ్లీ తీసుకొచ్చాం. మన ఉద్యోగాలు చైనాకు పోవడానికి వీల్లేదు. అందుకే టిక్‌టాక్‌ యాప్‌లో అమెరికా ప్రభుత్వం 50 శాతం భాగస్వామ్యం తీసుకుంటుంది. మహిళల క్రీడల్లో ట్రాన్స్‌జెండర్లు పాల్గొనకుండా నిలువరిస్తా. మూడో ప్రపంచ యుద్ధాన్ని నిలువరిస్తా. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తా. మధ్య ప్రాశ్చంలో శాంతి నెలకొనేలా చేస్తా. అధికారం చేపట్టకముందే ట్రంప్‌ ఎఫెక్ట్‌తో ఇప్పటికే కొన్ని పనులు జరిగిపోతున్నాయి. ఇది నా ప్రభావం కాదు. మీ అందరి ఎఫెక్ట్‌ అన్నారు.కాగా, టిక్‌టాక్‌ను తిరిగి ప్రారంభిస్తున్నామన్న ట్రంప్‌ ప్రకటనపై షార్ట్‌ వీడియో యాప్‌ కంపెనీ ధన్యవాదాలు తెలిపింది. బైడెన్‌ ప్రభుత్వ నిర్ణయంతో శనివారం నుంచి అమెరికాలో టిక్‌టాక్‌ యాప్‌ సేవలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. తాను అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత టిక్‌టాక్‌ యాక్సెస్‌ను పునరుద్ధరిస్తామని ట్రంప్‌ ప్రకటించారు. విక్టరీ ర్యాలీలో ప్రసంగిస్తూ టిక్‌టాక్‌లో అమెరికా 50 శాతం భాగస్వామ్యం తీసుకుందని చెప్పారు. దీంతో తమకు భరోసా ఇచ్చినందుకు ఈ చైనా కంపెనీ కృతజ్ఞతలు తెలిపింది.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రమాణం సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రమాణం
లోక‌ల్ గైడ్ :బుధవారం ఉదయం రాష్ట్రపతి భవన్‌లో, జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ భారత సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము...
సీఎంతో డిన్న‌ర్‌కి హాజ‌రైన నాగార్జున‌, అల్లు అర‌వింద్..
మే పుష్పం తళుక్కున మెరిసిన వేళ....
దేశమే మా ధ్యేయం
ప్రతి వారం 250 పాడి పశువుల యూనిట్ల గ్రౌండింగ్.... జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
ఎస్.బి.ఐ. బ్యాంకు  ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ
మ‌ళ్లీ మొద‌టి నుంచి దిల్లీ పంజాబ్ మ్యాచ్ !