'ఆపరేషన్ సింధూర్' పేరుకు అసలైన నేపథ్యం ఇదే...
By Ram Reddy
On
పహల్గామ్ ఉగ్రదాడిలో అమరులైనవారికి న్యాయం చేసేందుకు భారత త్రివిధ దళాలు పాక్, పీఓకేలోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై మెరుపుదాడులు నిర్వహించాయి. ఈ చర్యకు "ఆపరేషన్ సింధూర్" అనే పేరు పెట్టడంపై జాతి ఆసక్తిగా చూచింది. అసలు ఈ పేరుకి ప్రేరణ ఇచ్చింది ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ దాడే. బైసరన్ లోయలో 28 మంది పౌరులను పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులు మతం అడిగి మరీ కాల్చి చంపారు. ఈ ఘటనలో 26 ఏళ్ల నేవీ అధికారి వినయ్ ప్రాణాలు కోల్పోయాడు. పెళ్లైన ఐదు రోజుల్లోనే భర్తను కోల్పోయిన హిమాన్షి, అతని మృతదేహం వద్ద విలపిస్తున్న దృశ్యం దేశాన్ని కలచివేసింది. ఈ దాడిలో అనేకమంది మహిళలు తమ భర్తలను కోల్పోయారు. ఆ బాధకు, ఆ న్యాయానికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఈ చర్యకు ‘ఆపరేషన్ సింధూర్’ అనే పేరు పెట్టారు. భారత్ నిర్ణయం పట్ల పహల్గామ్ బాధితులు హర్షం వ్యక్తం చేశారు.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
07 May 2025 17:14:16
ఐపీఎల్ 2025 సీజన్ ఉత్కంఠంగా కొనసాగుతుండగా, ఆపరేషన్ సిందూర్ ప్రభావంతో ధర్మశాలలో జరగాల్సిన మ్యాచ్‌లపై అనిశ్చితి నెలకొంది. మే 10 వరకు ఉత్తర భారతదేశంలోని ప్రధాన విమానాశ్రయాలను...
Comment List