వరంగల్ ఖమ్మం హైవే పై ఆగి ఉన్న లారీని ఢీకొన్న మరో లారీ 

ఇద్దరికి తీవ్ర గాయాలు 

వరంగల్ ఖమ్మం హైవే పై ఆగి ఉన్న లారీని ఢీకొన్న మరో లారీ 

క్షతగాత్రులను కాపాడిన పోలీసులను అభినందించిన స్థానిక ప్రజలు.

లోకల్ గైడ్ తెలంగాణ: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని ఉప్పరపల్లి క్రాస్ రోడ్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో వరంగల్ నుండి ఖమ్మం వైపు వెళ్తున్న యాష్ లారీ ఆగి ఉన్న బొగ్గు లారిని ఒక్కసారిగా ఢీకొట్టింది. దీంతో ఢీ కొట్టిన లారీలోని డ్రైవర్ తీవ్ర గాయాల పాలు కాగా మరొకరికి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదం జరిగిన స్థలానికి 100 మీటర్ల దూరంలో పోలీస్ చెక్ పోస్ట్ ఉండడంతో  పాటు, అదే సమయంలో వర్ధన్నపేట ఎస్సై చందర్ తన సిబ్బందితో హైవే పెట్రోలింగ్ చేస్తూ ఆ పోలీస్ చెక్ పోస్ట్ వద్ద  ఆగి ఉన్నారు. ఈ ప్రమాదాన్ని గమనించిన ఎస్ఐ చందర్ తన సిబ్బందితో హుటాహుటిన ప్రమాద సంఘటన స్థలానికి వెళ్లి గోల్డెన్ అవర్ లో జెసిబిల సహాయంతో ఢీ కొట్టిన లారీని విడదీసి అందులో గాయాలపాలైన ఇద్దరిని అంబులెన్స్ సహాయంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.  దీంతో  ప్రాణా నష్టం తప్పిందని స్థానికులు పోలీసుల సేవల పట్ల హర్షం వ్యక్తం చేశారు .ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ప్రమాదంలో రెండు లారీలు మాత్రమే ఉన్నాయని నాలుగు లారీలు ఉన్నట్లు వస్తున్న వార్తలను నమ్మవద్దని సూచించారు. ప్రమాద పరిస్థితిని పూర్తిగా తెలుసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని వివరించారు. ఇప్పటికే లారీ డ్రైవర్ ఫిర్యాదు మేరకు నిర్లక్ష్యంగా వచ్చి ఢీ కొట్టిన లారీ పై కేసు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ప్రతి వారం 250 పాడి పశువుల యూనిట్ల గ్రౌండింగ్.... జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ప్రతి వారం 250 పాడి పశువుల యూనిట్ల గ్రౌండింగ్.... జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
*జులై 15 తర్వాత పాడి పశువుల కొనుగోలు ప్రక్రియ ప్రారంభించాలి *ప్రతి పాడి పశువుకు ఆర్.ఎఫ్.ఐ.డి. ట్యాగింగ్ కల్పించాలి *ఇందిరా మహిళా డెయిరీ నిర్వహణపై సమీక్షించిన జిల్లా...
ఎస్.బి.ఐ. బ్యాంకు  ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ
మ‌ళ్లీ మొద‌టి నుంచి దిల్లీ పంజాబ్ మ్యాచ్ !
గ్రామీణ బంద్ ను జయప్రదం చేయండి
కాళేశ్వరం సరస్వతి పుష్కరాల ప్రదేశం డ్రోన్ దృశ్యాలు.
క్రేజీ కాంబోలో సినిమా... 
పగడ్బందీగా ధాన్యం సేకరణ