నేడు ధరూర్ కు రానున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

నేడు ధరూర్ కు రానున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

లోకల్ గైడ్ : ధరూర్ మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం వద్ద శనివారం ఏర్పాటు చేసిన భూ భారతి చట్టం - 2025 అవగాహన సదస్సుకు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 8:05 గంటలకు బేగంపేట, హైదరాబాద్ నుండి హెలికాప్టర్ లో బయలుదేరి 8:50 గంటలకు గద్వాల ఐడిఓసి పి జె పి క్యాంపు వద్దగల హెలిప్యాడ్ కు చేరుకుంటారని తెలిపారు. అధికారులతో కలిసిన అనంతరం రోడ్డు మార్గాన అక్కడి నుండి బయలుదేరి ఉదయం 9:15 గంటలకు ధరూర్ తహసిల్దార్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో పాల్గొంటారని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమం ముగిసిన అనంతరం 11 గంటలకు బయలుదేరి నాగర్ కర్నూల్ జిల్లాకు వెళ్లనున్నట్లు ఆయన తెలిపారు.

Tags:

About The Author

Post Comment

Comment List

No comments yet.

Latest News

మాజీ ఎంపిపి తనయుడు సన్వవల్లి ఆంజనేయులు చొరవతో గుర్రంపల్లిలో నూతన విద్యుత్ ట్రాన్స్ ఫారం ఏర్పాటు మాజీ ఎంపిపి తనయుడు సన్వవల్లి ఆంజనేయులు చొరవతో గుర్రంపల్లిలో నూతన విద్యుత్ ట్రాన్స్ ఫారం ఏర్పాటు
లోకల్ గైడ్ తెలంగాణ, జిల్లేడు చౌదరిగూడెం: జిల్లేడు చౌదరిగూడెం మండల మాజీ ఎంపిపి సన్వవల్లి యదమ్మ తనయుడు ఆంజనేయులు గుర్రంపల్లి గ్రామ( జిల్లెల్ల గడ్డ) రైతుల ఇబ్బందులను...
ఉపాధ్యాయులే సమాజ నిర్మాతలు: 
మోడీ ప్రభుత్వ ఆదేశాలతో రెచ్చిపోతున్న అటవీశాఖ
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు పంపిణీ..
ఎన్‌ఈఈటీ-యూజి ఫలితాలపై మధ్యంతర స్టే – మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశం | Local Guide
ముస్తాఫిజుర్ రహ్మాన్‌కు BCB నుంచి NOC – ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఊరట | Local Guide
ఇసుక రిచ్ ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే..