రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల పరిశీలన

రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల పరిశీలన

లోకల్ గైడ్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన రాజీవ్ యువ వికాసం దరఖాస్తులను పరిశీలన చేసి లక్ష్యానికి అనుగుణంగా లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇండ్లు, ఉపాధి హామీ పథకం అంశాలపై సంబంధిత ఎంపీడీఓ, ఏపిఒ, సిడిపిఒ, తదితరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో రాజీవ్ యువ వికాసం పథకం క్రింద 44,655 దరఖాస్తులు రావడం జరిగాయని, ఆయా దరఖాస్తులను పరిశీలించి, అర్హత మేరకు 50 వేల రుణం కంటే ఎక్కువ ఉన్న రుణ దరఖాస్తులను సంబంధిత బ్యాంకు లకు రేపటిలోగా జాబితాలను పరిశీలనకు పంపించాలని తెలిపారు. అట్టి జాబితాలను బ్యాంకు అధికారులు పరిశీలించి ఈ నెల 14 లోగా పూర్తిచేయడం జరుగుతుందని అన్నారు . ఈ నెల 20 లోగా మండల కమిటీలు అట్టి దరఖాస్తులను, జాబితాలను పరిశీలన చేసి జిల్లా కమిటీకి పంపించడం జరుగుతుందని తెలిపారు. ఇట్టి జాబితాలను జిల్లా కమిటీ పరిశీలించి 30 లోగా జిల్లా మంత్రికి జాబితాలను మంజూరు నిమిత్తం సిఫారసు చేయడం జరుగుతుందన్నారు. జూన్ 2 నాటికి అట్టి ఎంపిక చేసిన జిల్లా లక్ష్యానికి అనుగుణంగా 13,450 మంది లబ్ధిదారులకు మంజూరు ఉత్తర్వులు అందించడం జరుగుతుందని తెలిపారు. 
             అనంతరం ఇందిరమ్మ ఇండ్లు పై సమీక్షిస్తూ, జిల్లాలో అర్హత కలిగిన మంజూరు చేసిన వారికి ఇండ్ల నిర్మాణానికి మార్క్ అవుట్ చేయడం జరిగినప్పటికీ కేవలం 25 శాతం మాత్రమే నిర్మాణాలు జరుగుతున్నాయని, నిర్మాణాలు ప్రారంభం కాని చోట్ల పనులు ప్రారంభించే విధంగా లబ్ధిదారులను ప్రోత్సహించాలని తెలిపారు. ఎల్లారెడ్డి , జుక్కల్, కామారెడ్డి నియోజక వర్గాలలో కూడా మంజూరు చేయడం జరుగుతుందని, అట్టి మంజూరు చేసిన లబ్ది దారులు ఇండ్ల నిర్మాణాలు చేసుకునే విధంగా పర్యవేక్షించి తెలిపారు. ప్రతీ రెండు మండలాలకు ఒక హౌసింగ్ ఏఈ లను కేటాయించడం జరిగిందని, ఏ ఈ లతో సమావేశాలు నిర్వహించి నిర్మాణాలు త్వరగా జరిగే విధంగా చూడాలని తెలిపారు. జిల్లాలో 22 మోడల్  ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వెంటనే పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఉపాధి హామీ పథకం క్రింద జిల్లాలో ఫామ్ పాండ్స్, ఇంకుడు గుంతలు, నిర్మించాలని ప్రతీ గ్రామ పంచాయతీ కి 5 చొప్పున లక్ష్యం గా నిర్ణయించే. జరిగిందని తెలిపారు. జిల్లాలో గ్రామ పంచాయతీ , అంగన్వాడీ భవన నిర్మాణాలకు, స్కూల్ మరుగుదొడ్లు నిర్మాణాలకు ప్రతిపాదించాలని తెలిపారు. లేబర్ టర్న్ ఔట్ పెంచాలని ఏపీఓ లను ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాలు, బోరు వెల్ ల వద్ద ఇందుకు గుంతలు నిర్మించాలని సూచించారు.ఈ సమీక్షా సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్, జిల్లా పంచాయతీ అధికారి మురళీ, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడి దయానంద్, జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారిని రజిత, సీపీఒ రాజారాం, ఎంపీడీఓ లు, ఏపీఒ లు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఇసుక క్వారీని రద్దు చేయాలని  బిజెపి ధర్నా ఇసుక క్వారీని రద్దు చేయాలని  బిజెపి ధర్నా
లోకల్ గైడ్మిడ్జిల్ మండలంలోని కొత్తపల్లి దుందుభి వాగు నుండి ఇసుక తరలింపుకు అనుమతులు రద్దుచేసి ఇసుక కోరిని ఆపాలని మిడ్జిల్ మండల బిజెపి నాయకులు బుధవారం స్థానిక...
రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ‌గారితో మ‌ర్యాద‌పూర్వ‌కంగా 
నూతన కమిషనర్లుగా నియమితులైన వారితో ప్రమాణం 
అసంఘటిత కార్మికుల కనీసం పది రోజుల పని దినాలు కల్పించాలి
చెరువుగట్టు పై అద్భుతమైన పాట పాడిన సింగర్ & యాంకర్ మంజుల యాదవ్ #singermanjulayadav #shorts #lgmedia
 పీఎఫ్‌ బ్యాలెన్స్‌ తెలుసుకోవడం ఇప్పుడు మరింత ఈజీ.. జస్ట్‌ మిస్డ్‌కాల్‌ ఇస్తే చాలు!
స‌రిహ‌ద్దు గ్రామాల ప్ర‌జ‌లు జంకుతున్నారు...ఎందుకో తెలుసా