బిఆర్ఎస్ రజతోత్సవ సభతో కాంగ్రెస్ ఖతం

భారాస రజోత్సవ పోస్టర్ ను విడుదల చేసిన 

బిఆర్ఎస్ రజతోత్సవ సభతో కాంగ్రెస్ ఖతం

గ్యారెంటీల అమలులో ఘోర వైఫల్యం

దమ్ముంటే స్థానికసంస్థల ఎన్నికలు నిర్వహించాలి 

బిఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్

 లోకల్ గైడ్:

ఈనెల 27న జరుగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభతో రాష్ట్రంలో కాంగ్రెస్ పని ఖతం కాకతప్పదని బీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ జోస్యం చెప్పారు. శనివారం పెద్దమందడి మండల కేంద్రంతో పాటు  జగత్ పల్లి, మణిగిల్ల,  ఆల్వాల్, చిన్న మందడి గ్రామాల్లో* వాకిటి శ్రీధర్ అధ్వర్యంలో రజతోత్సవ సభ సన్నాహక సమావేశాలు  సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వాగ్దానం చేసిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు,  రేవంత్ రెడ్డి సర్కార్ పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని,అందుకే  కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు  గ్రామాల్లో తిరగడానికి జంకుతున్నారని ఎద్దేవా చేశారు. దమ్ముంటే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని శ్రీధర్ సవాల్ విసిరారు. 15 నెలల రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ రాష్ట్రంలో  అభివృద్ది విధ్వంసానికి గురైందని ధ్వజమెత్తారు.ఐదేళ్ళ తన పదవీకాలంలో వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గాన్ని  మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్ని రంగాల్లో అభివృద్ది చేసి అగ్రగామిగా నిలిపారని అన్నారు. నియోజకవర్గంలో మాజీ సింగిరెడ్డి మంత్రి నిరంజన్ రెడ్డి రోడ్ల విస్తరణ, చేరువుల మరమ్మత్తు మెడికల్ కాలేజ్,జె.ఎన్.టి.యు కాలేజ్,అగ్రికల్చర్ కాలేజ్,లక్ష ఎకరాలకు సాగు నీళ్ళు అందించి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రభాగాన నిలిపారని ఉంచారని అన్నారు.కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి ఆగిపోయి,సంక్షేమ పథకాల కోతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, అందుకే ప్రభుత్వ మెడలు వంచి హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రజతోత్సవ సభ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. కెసిఆర్ హయాంలో తెలంగాణ సుభిక్షంగా అభివృద్ధిలో ఉన్నదని, అటువంటి తెలంగాణను కాంగ్రెస్ అధోగతి పాలుజేసిందని, అందుకే ప్రజలంతా సమాయత్తమై ఈ ప్రభుత్వంపై పోరాడాలని పిలుపునిచ్చారు.ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న రేవంత్ రెడ్డి పాలనను అడ్డుకోకుంటే రాష్ట్రం మరింత విధ్వంసానికి గురవుతుందని హెచ్చరించారు.పెద్దమందడి మండలం జగత్ పల్లి, మనిగిళ్ళ, పెద్దమందడి, అల్వాల,  పెద్దమందడి చిన్నమందడి గ్రామాల సమావేశాల లో మట్లాడి భారాస రజోత్సవ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు  వేణు, మాజీ జెడ్పిటిసి రఘుపతి రెడ్డి , మణిగిల్ల శ్రీనివాస్ గౌడ్, గోపాల్ పెట్ మండల పార్టీ అధ్యక్షుడు బాలరాజు, సింగిల్ విండో ఉపాధ్యక్షులు  కుమార్ యాదవ్ , గొర్ల కాపరుల డైరెక్టర్ నాగేంద్ర యాదవ్ , చిట్యాల రాము, కోట్ల వెంకటేష్, శివ గౌడు మరియు లక్ష్మణ్ గౌడ్ , సేనాపతి  , బి,ఆర్ఎస్ గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

యువ‌తి చేసిన ప‌నికి లావ‌ణ్య త్రిపాఠికి కోప‌మొచ్చింది. యువ‌తి చేసిన ప‌నికి లావ‌ణ్య త్రిపాఠికి కోప‌మొచ్చింది.
లోకల్ గైడ్: Lavanya Tripathi | యువ‌తి చేసిన ప‌నికి లావ‌ణ్య త్రిపాఠికి కోప‌మొచ్చింది.. మెగా కోడలు గ‌ట్టిగానే ఇచ్చి ప‌డేసిందిగా..! Lavanya Tripathi | పహల్గాంలో...
సింహాచలం ప్రమాదం గురించి తెలిసి ఎంతో దిగ్భ్రాంతిగా అనిపించింది: పవన్ కళ్యాణ్
యాప్‌లో ప్రకటన ఇచ్చి… ఆన్‌లైన్‌లో మోసానికి బలయ్యాడు!
అద్భుతమైన క్యాచ్ పట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫీల్డర్‌
‘రాధే శ్యామ్’ ద‌ర్శ‌కుడి దర్శకత్వంలో వ‌రుణ్ తేజ్ కొత్త చిత్రం
అంబేద్కర్ ఆశాల సాధనలో
గడపగడపకు జై బాబు, జై భీమ్, జై సంవిదాన్ నినాదం