క‌న్స‌ర్ట్‌ను క్యాన్సిల్‌ చేసిన శ్రేయాఘోషల్‌

SHREYA

లోకల్ గైడ్ : ఉగ్ర‌దాడి విషాదం.. క‌న్స‌ర్ట్‌ను క్యాన్సిల్‌ చేసిన శ్రేయాఘోషల్‌ జ‌మ్ము కశ్మీర్ అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గాం  ప్రాంతంలో ఉగ్ర‌దాడి జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ న‌ర‌మేధంలో 28 మర‌ణించారు.ఇక ఉగ్ర‌దాడి అనంత‌రం దేశంలో ప‌రిస్థితులు ఉత్కంఠగా మారిన విష‌యం తెలిసిందే. పలు న‌గ‌రాల్లో ఇప్ప‌టికే భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేశారు. అయితే దేశ‌వ్యాప్తంగా ప్ర‌స్తుతం హై అలర్ట్ ఉండ‌డంతో ప‌లువురు సినీ ప్ర‌ముఖులు త‌మ షోల‌ను క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఇప్పటికే సింగ‌ర్‌ అర్జిత్‌ సింగ్‌ ఏప్రిల్‌ 27న చెన్నైలో జరగాల్సిన తన షో రద్దు చేసుకోగా.. తాజాగా సింగ‌ర్ శ్రేయాఘోషల్ కూడా త‌న కన్స‌ర్ట్‌ను ర‌ద్దుచేసుకుంది. నేడు గుజ‌రాత్‌లోని సూర‌త్ వేదిక‌గా శ్రేయాఘోషల్‌  మ్యూజిక్ క‌న్స‌ర్ట్ ఉండ‌గా.. తాజాగా ఈ క్యాన్సిల్ చేసుకున్నామ‌ని ప్ర‌క‌టించింది శ్రేయా. ఇప్ప‌టికే షో కోసం టికెట్లు బుక్ చేసుకున్న‌వారికి డబ్బులు తిరిగి ఇచ్చేస్తామని వెల్ల‌డించారు.‘ఆల్ హార్ట్స్ టూర్ అనే పేరుతో శ్రేయాఘోషల్ దేశ విదేశాల్లో సంగీత ప్రదర్శనలు ఇస్తున్నారు. ఆమె చెన్నై, కోయంబత్తూరులో ఇప్పటికే ప్రదర్శనలు ఇచ్చారు. ఈరోజు సూరత్‌లో జరగాల్సిన కార్యక్రమం రద్దయింది. మ‌ళ్లీ ముంబైలో మే 10న ఆమె షో ఉంటుంది. మరోవైపు, అనిరుధ్ కూడా ‘హుకుమ్’ పేరుతో ప్రపంచ టూర్‌ చేస్తున్నారు. మే 31న బెంగళూరులో జరగనున్న ఆయన కాన్సర్ట్ టికెట్లు గంటలోనే అమ్ముడయ్యాయి. ప్రేక్షకుల ఆదరణతో జూన్ 1న కూడా కార్యక్రమం ఉంటుందని తెలిపారు. అయితే, ఉగ్రదాడి కారణంగా రెండో రోజు టికెట్ల అమ్మకాలు వాయిదా పడ్డాయి. కొత్త తేదీని త్వరలో ప్రకటించ‌నున్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

యువ‌తి చేసిన ప‌నికి లావ‌ణ్య త్రిపాఠికి కోప‌మొచ్చింది. యువ‌తి చేసిన ప‌నికి లావ‌ణ్య త్రిపాఠికి కోప‌మొచ్చింది.
లోకల్ గైడ్: Lavanya Tripathi | యువ‌తి చేసిన ప‌నికి లావ‌ణ్య త్రిపాఠికి కోప‌మొచ్చింది.. మెగా కోడలు గ‌ట్టిగానే ఇచ్చి ప‌డేసిందిగా..! Lavanya Tripathi | పహల్గాంలో...
సింహాచలం ప్రమాదం గురించి తెలిసి ఎంతో దిగ్భ్రాంతిగా అనిపించింది: పవన్ కళ్యాణ్
యాప్‌లో ప్రకటన ఇచ్చి… ఆన్‌లైన్‌లో మోసానికి బలయ్యాడు!
అద్భుతమైన క్యాచ్ పట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫీల్డర్‌
‘రాధే శ్యామ్’ ద‌ర్శ‌కుడి దర్శకత్వంలో వ‌రుణ్ తేజ్ కొత్త చిత్రం
అంబేద్కర్ ఆశాల సాధనలో
గడపగడపకు జై బాబు, జై భీమ్, జై సంవిదాన్ నినాదం