‘ఆపరేషన్ సిందూర్’ విజయంపై ప్రముఖుల ప్రశంసలు

సైన్యానికి అద్భుత మద్దతు

‘ఆపరేషన్ సిందూర్’ విజయంపై ప్రముఖుల ప్రశంసలు

పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడికి దీటైన ప్రతిస్పందనగా భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ సిందూర్’కు శ్రీకారం చుట్టింది. మంగళవారం అర్ధరాత్రి 1.44 గంటలకు భారత సైన్యం పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై మెరుపుదాడులు జరిపింది. ఈ ఆపరేషన్ విజయవంతంగా కొనసాగడంతో దేశవ్యాప్తంగా గర్వావేశాలు వెల్లివిరిచాయి. సోషల్ మీడియాలో ‘జై హింద్’, ‘భారత్ మాతా కీ జై’, ‘ఆపరేషన్ సిందూర్’ అనే హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి. పలువురు ప్రముఖులు సైన్యం ధైర్యాన్ని అభినందిస్తూ స్పందించారు.

చిరంజీవి: “ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడం గర్వకారణం. జై హింద్!”

పవన్ కల్యాణ్: “ఎన్నో రోజుల నిశ్శబ్దం తర్వాత ఈ ఆపరేషన్ దేశవ్యాప్తంగా స్ఫూర్తిని నింపింది. త్రివిధ దళాల ధైర్యానికి, దీనికి నాయకత్వం వహించిన ప్రధానమంత్రికి ధన్యవాదాలు. మేమంతా మీతోనే ఉన్నాం.”

ఆనంద్ మహీంద్రా: “మా ప్రార్థనలు భద్రతా బలగాల కోసం. ఒకే దేశం.. ఒకే గొంతు.. కలిసి నిలబడదాం.”

రజనీకాంత్: “ఇది పోరాటం ప్రారంభం మాత్రమే. లక్ష్యం నెరవేరే వరకు ఆగడం లేదు. దేశం మొత్తం మీ వెంటే ఉంది. జై హింద్!”

ప్రకాశ్ రాజ్: “భారత్‌ తీసుకున్న చర్యలు ఉగ్రవాద నిర్మూలన దిశగా సాగాయి. పాకిస్థాన్‌ సైనిక స్థావరాలను కాదు, కేవలం ఉగ్ర స్థావరాలనే లక్ష్యంగా చేసుకుంది. 26 మంది అమాయకులను బలిగొన్న దాడికి ఇది సముచిత ప్రతీకారం. దేశం నిబద్ధతతో ముందుకెళ్తోంది.”

ఈ సందర్బంగా దేశవ్యాప్తంగా భారత సైన్యానికి విశేష మద్దతు లభిస్తుంది. సామాన్యుల నుంచి సినీ, వ్యాపార రంగాలవారివరకు అందరూ తమ గళం కలిపారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

 మే 27న కేర‌ళ‌కు నైరుతి రుతుప‌వ‌నాలు   మే 27న కేర‌ళ‌కు నైరుతి రుతుప‌వ‌నాలు 
దిల్లీ: ఈ ఏడాది భారతదేశంలో నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే ముందే ప్రవేశించనున్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. సాధారణంగా జూన్ 1న కేరళలో రుతుపవనాలు ప్రవేశిస్తాయి....
కోట మశమ్మ పండుగకు గుంజి బజారు హమాలీలకు  ఆర్థిక సహకారం చేసిన
జుట్టు పెరుగుదలలో ప్రధాన పాత్ర పోషించేది ఏమిటో తెలుసా.....
పాకిస్తాన్‌లో పెట్రోల్ బంకులు క్లోజ్.. 
వంగూరి వాచకం -నవరత్నాలు
ఘనంగా ప్రారంభమైన బీచుపల్లి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు
అమ్మ ఎదురుచూపు