పెళ్లి రోజు వేళ.... సుప్రభాత సేవ...

- శ్రీ సీతారామ చంద్ర స్వామిని దర్శించుకున్న పొంగులేటి దంపతులు

పెళ్లి రోజు వేళ.... సుప్రభాత సేవ...

భద్రాచలం, లోకల్ గైడ్ : తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి - మాధురి దంపతులు భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్ర స్వామిని గురువారం దర్శించుకున్నారు. పెళ్లి రోజు సందర్భంగా ఆలయంలో స్వామివారి సుప్రభాత సేవకు హాజరయ్యారు. అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. వేద పండితులు వేద ఆశీర్వచనం ఇచ్చి గోత్ర నామాలతో పూజలు చేశారు.  అనంతరం మంత్రి పొంగులేటి దంపతులు ఐటీసీ గెస్ట్ హౌస్ లో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, పోతిరెడ్డి వేంకటేశ్వర రెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చీకటి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News