సవారమ్మ, మారెమ్మ అమ్మ  వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే 

సవారమ్మ, మారెమ్మ అమ్మ  వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే 

గద్వాల, లోకల్ గైడ్:
గద్వాల నియోజకవర్గం ధరూర్ మండలం పరిధిలోని ర్యాలంపాడు, కోతుల గిద్ద    గ్రామంలోని  గ్రామదేవత  పెద్దమ్మ, ఈదమ్మ, లక్ష్మమ్మ  దేవర సందర్భంగా బుధవారం అమ్మవారిని దేవాలయంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులను పొందారు. అలా మల్డకల్ మండలం పరిధిలోని అమరవాయి గ్రామంలో సవారమ్మవ్వ, కర్రెమ్మవ్వ అమ్మ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతర అమరవాయి గ్రామంలో నాయకుడు తిమ్మారెడ్డి ఇంట్లో దేవర సందర్భంగా ఎమ్మెల్యే నాయకులతో కలిసి తేనేటి విందులో పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామ దేవతలను పూజించడం వల్ల గ్రామంపై దుష్టశక్తులు రాకుండా గ్రామదేవతలు కాపాడడం జరుగు తుందన్నారు. గ్రామంలో ప్రతి ఇంట్లో దేవర సందర్భంగా పండగ వాతావరణం నెలకొందన్నారు. గ్రామదేవతలు ఆశీస్సులతో గ్రామంలోని ప్రజలు సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకోవడం జరిగినదన్నారు. ఈ కార్యక్రమంలో  మాజీ ఎంపీపీలు విజయ్, రాజారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ గోపాల్ రెడ్డి, నాయకులు కృష్ణ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, తిమ్మారెడ్డి, రంగస్వామి, పురుషోత్తం రెడ్డి, జనార్దన్ రెడ్డి, మహేష్ , నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

కేకేఆర్‌ ప్లేఆఫ్స్‌ ఆశలకు చెన్నై గండికొట్టింది కేకేఆర్‌ ప్లేఆఫ్స్‌ ఆశలకు చెన్నై గండికొట్టింది
ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌ రేసు ఉత్కంఠభరితంగా మారింది. ప్రతి మ్యాచ్‌తో సమీకరణాలు మారుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో గెలిచే తీరున ఉండాల్సిన డిఫెండింగ్‌ చాంపియన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌),...
ఐపీఎల్‌పై ఆపరేషన్ సిందూర్ ప్రభావం: మ్యాచ్‌లు జరుగుతాయా లేదా?
మన్యం వీరుడు అల్లూరి పోరాట స్ఫూర్తితో ఉద్యమిద్దాం
సవారమ్మ, మారెమ్మ అమ్మ  వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే 
Yerra Yerrani Rumalu Gatti Singer Mallamma Emotional Interview | Anchor & Singer Manjula Yadav
‘ఆపరేషన్ సిందూర్’ విజయంపై ప్రముఖుల ప్రశంసలు
ఐరాస భద్రతామండలిలో పాకిస్థాన్‌కు కఠిన ప్రశ్నలు