ఐపీఎల్‌పై ఆపరేషన్ సిందూర్ ప్రభావం: మ్యాచ్‌లు జరుగుతాయా లేదా?
ఐపీఎల్ 2025 సీజన్ ఉత్కంఠంగా కొనసాగుతుండగా, ఆపరేషన్ సిందూర్ ప్రభావంతో ధర్మశాలలో జరగాల్సిన మ్యాచ్‌లపై అనిశ్చితి నెలకొంది. మే 10 వరకు ఉత్తర భారతదేశంలోని ప్రధాన విమానాశ్రయాలను మూసివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో, పంజాబ్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ సాధ్యమేనైనా, ముంబై ఇండియన్స్ తదితర మ్యాచ్‌లపై సందేహాలు నెలకొన్నాయి.
జమ్మూ, శ్రీనగర్, లేహ్, చండీగఢ్, జోధ్‌పూర్, అమృత్‌సర్, భుజ్, జామ్‌నగర్, రాజ్‌కోట్ వంటి విమానాశ్రయాలతో పాటు ధర్మశాల ఎయిర్‌పోర్ట్ కూడా తాత్కాలికంగా మూసివేయబడింది. దీంతో ధర్మశాలలోని పలు మ్యాచ్‌లు నిర్వహణపై ప్రశ్నార్థకాలు ఉత్పన్నమయ్యాయి.
అయితే మే 8న పంజాబ్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ కోసం రెండూ జట్లు ఇప్పటికే ధర్మశాలకు చేరుకున్నాయి. దీంతో ఈ మ్యాచ్ షెడ్యూల్ ప్రకారమే జరిగే అవకాశముంది. ఇక మిగిలిన మ్యాచ్‌లపై ఆపరేషన్ సిందూర్ ప్రభావం ఎంతవరకూ ఉంటుందన్నది త్వరలో తేలనుంది.
Comment List