ఐపీఎల్ ఆటగాళ్లను వందే భారత్ రైలు ద్వారా ఢిల్లీకి తరలించిన బీసీసీఐ

పాక్ దాడుల వల్ల ధర్మశాలలో మ్యాచ్ రద్దు!

ఐపీఎల్ ఆటగాళ్లను వందే భారత్ రైలు ద్వారా ఢిల్లీకి తరలించిన బీసీసీఐ

ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ – ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో భద్రతా కారణాల వల్ల ఆటను మధ్యలోనే నిలిపివేయాల్సి వచ్చింది. పాక్ దాడుల నేపథ్యంలో జరిగిన బ్లాక్‌అవుట్‌ కారణంగా ఫ్లడ్‌లైట్లు పనిచేయకపోవటంతో మ్యాచ్‌ను కొనసాగించలేక బీసీసీఐ అదే రోజున రద్దు చేసింది. ఈ పరిస్థితుల్లో ఆటగాళ్లతో పాటు కామెంటేటర్లు, ప్రసార బృందాన్ని కలుపుకుని సుమారు 300 మంది సభ్యులను హైస్పీడ్ వందే భారత్ రైలులో ఢిల్లీకి ప్రత్యేకంగా తరలించినట్లు సమాచారం. మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ బ్యాటింగ్ ఎంచుకుని 10.1 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 122 పరుగులు చేసింది. ప్రియాంష్ ఆర్య 70 పరుగులు చేసి అవుట్ కాగా, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ 50 పరుగులతో క్రీజులో ఉన్నాడు. స్టేడియం 23వేల సీటింగ్ సామర్థ్యం కలిగి ఉండగా, మ్యాచ్ ఆగే సమయానికి 80% ప్రేక్షకులు హాజరయ్యారు. అప్రమత్తంగా స్పందించిన సెక్యూరిటీ సిబ్బంది ప్రేక్షకులను సురక్షితంగా బయటకు తరలించారని హిమాచల్ క్రికెట్ అసోసియేషన్ పేర్కొంది. అయితే, మ్యాచ్ నిలిపివేతతో నిరాశకు గురైన అభిమానులు పాక్ చర్యలను తీవ్రంగా విమర్శించారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

 మే 27న కేర‌ళ‌కు నైరుతి రుతుప‌వ‌నాలు   మే 27న కేర‌ళ‌కు నైరుతి రుతుప‌వ‌నాలు 
దిల్లీ: ఈ ఏడాది భారతదేశంలో నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే ముందే ప్రవేశించనున్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. సాధారణంగా జూన్ 1న కేరళలో రుతుపవనాలు ప్రవేశిస్తాయి....
కోట మశమ్మ పండుగకు గుంజి బజారు హమాలీలకు  ఆర్థిక సహకారం చేసిన
జుట్టు పెరుగుదలలో ప్రధాన పాత్ర పోషించేది ఏమిటో తెలుసా.....
పాకిస్తాన్‌లో పెట్రోల్ బంకులు క్లోజ్.. 
వంగూరి వాచకం -నవరత్నాలు
ఘనంగా ప్రారంభమైన బీచుపల్లి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు
అమ్మ ఎదురుచూపు