పదవ తరగతి ఫలితాల్లో లక్షెట్టిపేట గురుకుల బాలికల విజయకేతననం.
లోకల్ గైడ్ :సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాల లక్షెట్టిపేట లో పదవ తరగతి ఫలితాలలో విద్యార్థినులు విజయ దుందుభి మోగించినట్టుగా కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి కె. రమా కళ్యాణి ఒక ప్రకటనలో తెలియజేశారు. పదవ తరగతిలో 79 మంది బాలికలు పరీక్షకు హాజరుకాగా 79 ఉత్తీర్ణులై.... 100/ ఫలితాలు.. సాధించడం జరిగిందని ప్రిన్సిపల్ తెలియజేశారు.పాఠశాల టాపర్ గా గొల్ల శృతిక - 563/600 మార్కులతో మొదటి స్థానం నిలువగా, అక్కల సాయి త్రినిత - 561/600 రెండవ స్థానంలో నిలువగా, బడావత్ దీపిక - 555/600 మార్కులతో మూడో స్థానం సాధించిందని ప్రిన్సిపల్ తెలిపారు. అలాగే 79 మంది బాలికలలో దాదాపు 35.... మంది విద్యార్థులకు 500 పైగా మార్కులు సాధించి లక్షెట్టిపేట్ గురుకుల పాఠశాల ఘనతను మరోసారి నిలిపినట్టు తెలియజేశారు.అద్భుతమైన ఫలితాలను సాధించిన టాపర్ లను, ఇతర విద్యార్థినులను కళాశాల వైస్ ప్రిన్సిపల్ కే. మహేశ్వరరావు మరియు, కే. శ్రీలత, హెచ్ శ్రీలత, ఉమాదేవి, సరస్వతి, భాగ్యలక్ష్మి, రజిత, మంజుల రాణి, ప్రవీణ, హేమలత, సుజాత.. తదితరులు అభినందించారు. Sd/- ప్రిన్సిపల్
Comment List