ప్రజలందరికీ అందుబాటులో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
ప్రతి సమస్యకూ పరిష్కార మార్గం చూపుతున్న ఎమ్మెల్యే
నాయకుడు ప్రజల మధ్య ఉండాలన్న భావనకు జీవం పోస్తున్న శంకర్
షాద్‌నగర్:
షాద్‌నగర్ నియోజకవర్గానికి చెందిన ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ, ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుండే ఎమ్మెల్యేగా వీర్లపల్లి శంకర్ అభివృద్ధి పరంగా మంచి పేరు తెచ్చుకుంటున్నారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలతో నేరుగా ముఖాముఖి సమావేశమవుతూ, వారి సమస్యలను సవినయంగా విని, పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకుంటున్నారు.గతంలో ప్రజా ప్రతినిధులు ప్రాంతానికి దూరంగా ఉంటూ, ప్రజలకు అందుబాటులో ఉండరని పలువురు పేర్కొంటున్నారు. అయితే ప్రస్తుత ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాత్రం రోజువారీగా క్యాంపు కార్యాలయంలో గడిపే సమయాన్ని పెంచడంతో ప్రజలకు తక్షణ సేవలు అందుతున్నాయని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.పలు సమస్యలపై అధికారులను వెంటనే పిలిపించి నిర్ణయాలు తీసుకోవడం, అభివృద్ధి కార్యక్రమాలపై నిరంతర సమీక్ష చేయడం, ప్రజల అభిప్రాయాలను ప్రాధాన్యంగా పరిగణనలోకి తీసుకోవడం వంటి అంశాల్లో ఆయన శ్రద్ధ వహిస్తున్నారు. విద్య, వైద్య, రహదారులు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ, ప్రజల నిత్యజీవితాన్ని మెరుగుపరిచే దిశగా శ్రమిస్తున్నారు.ప్రజల మద్దతు లేకుండా నాయకుడు ఎదగలేడు. నేను ప్రజల కోసమే పనిచేస్తున్నాను. వాళ్ల విశ్వాసమే నన్ను నడిపిస్తోంది అంటూ ఆయన పలుమార్లు పేర్కొనడం విశేషం.ప్రజలు తమ సమస్యలకు తక్షణ పరిష్కారం లభిస్తుండటంతో ఎమ్మెల్యే శంకర్ పట్ల విశ్వాసం పెరుగుతోందని, ఇలా అందుబాటులో ఉండే నాయకులే ప్రజాస్వామ్యానికి జీవం అని స్థానిక పెద్దలు అభిప్రాయపడుతున్నారు.
Comment List