వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కి ఆసీస్ జట్టు ప్రకటన

వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కి ఆసీస్ జట్టు ప్రకటన

లోక‌ల్ గైడ్ :
వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ కోసం 16 మంది సభ్యులతో కూడిన జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. జూన్ 11వ తేదీ నుంచి లార్డ్స్ మైదానంలో జరిగే ఈ ఫైనల్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికాతో తలపడనుంది.బ్యాట్స్‌మన్ సామ్ కోన్స్‌టాస్‌కు జట్టులో చోటు దక్కగా, స్పిన్నర్ మాట్ కుహనేమాన్, ఫాస్ట్ బౌలర్ బ్రెండన్ డగెట్ ట్రావెల్ రిజర్వ్‌ లిస్టులో ఉన్నారు. శ్రీలంక టూర్ తర్వాత కెప్టెన్సీకి విరామం తీసుకున్న ప్యాట్ కమిన్స్ ఈసారి మళ్లీ ఆస్ట్రేలియా జట్టుకు నాయకత్వం వహించనున్నాడు.జోష్ హేజిల్‌వుడ్, కెమరూన్ గ్రీన్ కూడా జట్టులోకి తిరిగొచ్చారు. అయితే తుది జట్టులో స్థానం కోసం గ్రీన్‌తో పాటు బూ వెబ్‌స్టర్ మధ్య పోటీ కనిపించే అవకాశం ఉంది. హేజిల్‌వుడ్‌కు ప్రస్తుతం భుజం నొప్పి ఉన్నప్పటికీ, ఫైనల్‌కి ముందు పూర్తిగా కోలుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఫైనల్ ముగిసిన తర్వాత ఆసీస్ జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ జూన్, జూలై నెలల్లో మూడు టెస్టుల సిరీస్ జరగనుంది.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ప్రతి వారం 250 పాడి పశువుల యూనిట్ల గ్రౌండింగ్.... జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ప్రతి వారం 250 పాడి పశువుల యూనిట్ల గ్రౌండింగ్.... జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
*జులై 15 తర్వాత పాడి పశువుల కొనుగోలు ప్రక్రియ ప్రారంభించాలి *ప్రతి పాడి పశువుకు ఆర్.ఎఫ్.ఐ.డి. ట్యాగింగ్ కల్పించాలి *ఇందిరా మహిళా డెయిరీ నిర్వహణపై సమీక్షించిన జిల్లా...
ఎస్.బి.ఐ. బ్యాంకు  ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ
మ‌ళ్లీ మొద‌టి నుంచి దిల్లీ పంజాబ్ మ్యాచ్ !
గ్రామీణ బంద్ ను జయప్రదం చేయండి
కాళేశ్వరం సరస్వతి పుష్కరాల ప్రదేశం డ్రోన్ దృశ్యాలు.
క్రేజీ కాంబోలో సినిమా... 
పగడ్బందీగా ధాన్యం సేకరణ