సీజన్ కాకున్నా.. వ్యాపిస్తున్న జ్వరాలు 

 సీజన్ కాకున్నా.. వ్యాపిస్తున్న జ్వరాలు 

లోక‌ల్ గైడ్ : 
 నగరంలో వారం రోజులుగా కొత్తగా వైరల్‌ జ్వరాలతో బాధపడుతున్నవారి సంఖ్య రోజురోజుకూ అధికమవుతోంది. సాధారణంగా వర్షాకాలంలో జ్వరాలు వస్తాయి. అవి సులువుగా అన్ని ప్రాంతాలకూ వ్యాపిస్తాయి. ప్రస్తుతం అగ్నినక్షత్రంలో ఈ జ్వరాలను సీజన్‌ జ్వరాలు అని చెప్పలేమని వైద్యనిపుణులు చెబుతున్నారు. అయినా జ్వరపీడితుల సంఖ్య క్రమంగా పెరుగుతోందన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో జ్వరాలతో చేరేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందన్నారు.కొత్తగా వైరల్‌ జ్వరాలు కావొచ్చని చెబుతున్నారు. ఈ విషయమై వైరాలజీ నిపుణులు మాట్లాడుతూ... ఇది సాధారణమైన ‘ఫ్లూ’ జ్వరాలేనని, తెలిపారు. వీటిలో ఇన్‌ఫ్లూయెంజా బి.వైరస్‌ కాస్త వైవిధ్యంగా ఉంటుందని చెప్పారు. జ్వరం తగ్గినప్పటికి రెండు వారాల పాటు గొంతు నొప్పిగా ఉంటుందన్నారు. ఈ గొంతునొప్పి వల్ల మాటలు సరిగా రావని, దీని కారణంగానే నగరవాసులు ఈ రకం జ్వరాలంటే భయపడుతున్నారని, ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందనవసరం లేదన్నారు. ప్రస్తుతం నగరమంతా జ్వరాలు వ్యాప్తి చెందుతుండటాన్ని రాష్ట్ర రోగనిరోధక శాఖ అధికారులు పరిశీలిస్తున్నారని, ఎలాంటి వైర్‌స లేదని నిర్ధారణ అవుతోందని తెలిపారు. అయినప్పటికీ రక్త నమూనాలు సేకరించి పరీక్షిస్తున్నారని చెప్పారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

క్రేజీ కాంబోలో సినిమా...  క్రేజీ కాంబోలో సినిమా... 
లోక‌ల్ గైడ్ :యువ కథానాయకుడు శ్రీవిష్ణుకు విక్టరీ వెంకటేశ్ అభిమాన హీరో. ఈ విషయాన్ని అతను అనేకసార్లు మీడియాలో చెప్పారు. ఇటీవల విడుదలైన శ్రీవిష్ణు '#సింగిల్' మూవీలో...
పగడ్బందీగా ధాన్యం సేకరణ
వరి ధాన్యం తూకం జాగ్రత
జాతీయ బీసీ సేన అయ్యవారిపల్లి మహిళ గ్రామ కమిటి ఎన్నిక 
‘వరంగల్​.. జరూర్​ ఆనా ’
త్యాగాల పునాదిపై ఏర్పడ్డ రాష్ట్రంలో 
ఇంటర్ ఎంపిసిలో  హ‌రిప్రియకు రాష్ట్ర స్థాయి ర్యాంక్