వంగూరి వాచకం -నవరత్నాలు
By Ram Reddy
On
వంగూరి వాచకం -నవరత్నాలు
1.లాభాలలో భాగానికి
పరుగున పయనం
పాపాలలో పాలుకు
పరివారమంతా పలాయనం
2.పంచశీల
ప్రపంచశాంతి భారత బీజం
హద్దు మీరితే
బుద్ధి చెప్పడం మా నైజం
3.అలుపు
ఆరోగ్యానికి పిలుపు
బలుపు
అనారోగ్యాన్ని తెలుపు
4.గతం గందరగోళమైతే
వర్తమానం ఘనం
మనసు నిలిపి చూస్తే
మనకదే బహుమానం
5.మదినిండా మెదిలేది
మధురానుభూతి
మలి సంధ్య కోరేది
సానుభూతి
6.మహాత్ముడి స్వప్నం
రామరాజ్యం
నాయకాసురుల స్వర్గం
సంగ్రామరాజ్యం
7.మనిషి బండి నడిపించేను
మన్నికైన పిడికెడు గుండె
పద్ధతిగా నీవు ‘నడుచు’కుంటేను
పది కాలాలు నీకది అండే
8.తరువులు తరిగితే
కరువుకు నెలవు
మనసులు విరిగితే
మమతలకు సెలవు
9.శోధించి మధించి
పేర్చి కూర్చి రాస్తారు కవులు
శ్రమించి చిగురించి
ఓర్చి తీర్చి పూస్తాయి పూవులు
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
03 May 2025 18:13:24
తిట్టడం తప్పే కాదనను కానీ ఇలా చేయడం కరెక్ట్ కాదు
Vizag Satya and Uppal Balu Exclusive Interview Promo | Vizag Satya About...
Comment List