గుడ్ న్యూస్ చెప్పిన వ‌రుణ్ తేజ్,లావ‌ణ్య‌త్రిపాఠి....

గుడ్ న్యూస్ చెప్పిన వ‌రుణ్ తేజ్,లావ‌ణ్య‌త్రిపాఠి....

లోకల్ గైడ్:  వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతులు శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు. తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటిస్తూ ఒక క్యూట్ ఫోటోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. "జీవితంలో అత్యంత అందమైన పాత్ర పోషించనున్నాను... కమింగ్ సూన్" అంటూ వరుణ్ తేజ్ క్యాప్షన్ పెట్టారు. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. సినీ ప్రముఖులు సమంత, రకుల్ ప్రీత్ సింగ్, అల్లు స్నేహా తదితరులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు.

2017లో వచ్చిన 'మిస్టర్' సినిమాతో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి తొలిసారిగా కలిసి నటించారు. అప్పుడు నుంచే వీరి మధ్య స్నేహం చిగురించింది. ఆ తర్వాత 2018లో వచ్చిన 'అంతరిక్షం' చిత్రంలోనూ వీరి జంట ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. 2023 నవంబర్ 1న ఇటలీలోని టస్కానీలో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇటీవల లావణ్య త్రిపాఠి 'సతీ లీలావతి' అనే వెబ్ సిరీస్‌లో నటించారు.

 

 

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News